https://oktelugu.com/

Samantha Ruth Prabhu : సమంతకు సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ నుండి రొమాంటిక్ గిఫ్ట్… సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 3, 2024 / 08:24 PM IST

    Samantha Ruth Prabhu

    Follow us on

    Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్న సమంత మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. సినిమాలు పై ఫోకస్ చేస్తున్నారు. సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ హాని బన్నీ ‘ విడుదలకు సిద్దమవుతుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ సిటాడెల్ కి ఇది ఇండియన్ వెర్షన్.

    అలాగే సమంత పుట్టినరోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ అనౌన్స్ చేసింది. ఈ మూవీ తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత, 37వ పుట్టినరోజు జరుపుకుంది. స్నేహితులతో కలిసి గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ సమంత సంచరించిన అందమైన ప్రదేశాలు, పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    తాజాగా సమంత ఓ ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది. అందులో రోజ్ గోల్డ్ చైన్ ధరించి కనిపించింది. ఆ చైన్ కి కన్ను గుర్తుతో ఉన్న డాలర్ ఉంది. దీన్ని స్పెషల్ గా హైలెట్ చేస్తూ సమంత దిగిన ఫోటో ఇప్పుడు చర్చకి దారితీస్తోంది. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. లవ్ థాంక్యూ… అని సదరు ఫోటోకి కామెంట్ జోడించింది. దీంతో నీ సీక్రెట్ బాయ్ బర్త్ డే కి గిఫ్ట్ గా ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత పై ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే సమంతకు ఆ చైన్ ఓ ఫ్రెండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇటీవల ఓ హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది సమంత. అందులో ఆరోగ్యం గురించి హెల్త్ టిప్స్ చెబుతుంది. అటు కెరీర్ పై ఫోకస్ చేస్తుంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.