Anti Aging Medicine: మనుషులు వయసు పై బడుతున్నా కొద్దీ వృద్ధులుగా మారుతుంటారు. ఎందుకంటే ఒకప్పటి మాదిరిగా శరీరంలో అవయవాలు పనిచేయవు. పైగా అనేక రకాలుగా మార్పులు వస్తుంటాయి. హార్మోన్ల పనితీరు. కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల వెంట్రుకలు తెల్లగా మారుతుంటాయి. చర్మం నిగనిగలాడే విధానాన్ని కోల్పోతూ ఉంటుంది. దేహంలో ఒకప్పటి మాదిరిగా ఉత్తేజం ఉండదు. చర్మం కూడా ముడతలు పడుతూ ఉంటుంది. అవలీలగా నాలుగు మైళ్ళు నడిచిన పాదాలు.. నాలుగు అడుగులు వేయడానికి ఇబ్బంది పడతాయి.
చాలామంది వృద్ధాప్యాన్ని అస్సలు ఒప్పుకోరు. జుట్టు తెల్లబడుతుంటే నల్ల రంగు వేసుకుంటారు. ఉత్తేజం కోసం మందులు వాడుతుంటారు. చర్మంలో నూతనత్వం కనిపించాలని రకరకాల వైద్య విధానాలను ఆశ్రయిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అవి దీర్ఘకాలం పనిచేయవు. ఎందుకంటే మందులను తట్టుకునే శక్తి దేహానికి ఉన్నంతవరకే ఇదంతా. ఒకసారి శరీరానికి ఆ సామర్థ్యం తగ్గిపోతే ఎన్ని మందులు వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు.
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డీ ఏజింగ్ మీద రకరకాల ప్రయోగాలు జరిగాయి. కంపెనీలు మందులు తయారుచేసి మార్కెట్లో విడుదల కూడా చేశాయి. అయితే వీటిల్లో చాలావరకు మందులు కొంత పరిధి వరకే పని చేశాయి. దీంతో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు డి ఏజింగ్ మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రష్యా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ప్రయోగాలు చేశారు. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే మందులను తయారు చేస్తున్నటువంటి ప్రకటించారు. తమ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలి జన్యు చికిత్స అవసరాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రకటించింది.
కణాల ఏజింగ్ ప్రేరేపించే. రిసెప్టర్ ఫర్ అడ్వాన్స్డ్ గ్లికేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ జన్యువును ఈ మందు నిరోధిస్తుందని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మనిషి 150 సంవత్సరాలు బతకడం సాధ్యమని పేర్కొన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రష్యా శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రయోగం ప్రస్తుతం చివరి దశలో ఉన్నటువంటి తెలుస్తోంది. ఇంకా అనేక రకాల ప్రయోగాలు జరిగిన తర్వాత ఈ మందు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి జీవితానికి సంబంధించి ఇప్పటివరకు అమెరికా, భారత్, చైనా శాస్త్రవేత్తలు మాత్రమే గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రష్యా శాస్త్రవేత్తలు చేరిపోవడం విశేషం.