Homeఎంటర్టైన్మెంట్Michael Jackson biopic low opening India: 'మైఖేల్ జాక్సన్' బయోపిక్ మూవీ కి ఇండియాలో...

Michael Jackson biopic low opening India: ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ మూవీ కి ఇండియాలో ఇంత తక్కువ ఓపెనింగ్ వసూళ్లా.. ఇది అసలు ఊహించలేదు..

Michael Jackson biopic low opening India: పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాదు , పాన్ వరల్డ్ లెవెల్ లో బయోపిక్ మూవీస్ పై ఆడియన్స్ చూపించే ఆసక్తి వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా లెజెండ్స్ గా , ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి , కోట్లాది మంది హృదయాలను గెల్చుకునే తారల బయోపిక్స్ కి మామూలు క్రేజ్ ఉండదు. అలా అమెరికన్ పాప్ సింగర్ / డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కి […]

Michael Jackson biopic low opening India: పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాదు , పాన్ వరల్డ్ లెవెల్ లో బయోపిక్ మూవీస్ పై ఆడియన్స్ చూపించే ఆసక్తి వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా లెజెండ్స్ గా , ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి , కోట్లాది మంది హృదయాలను గెల్చుకునే తారల బయోపిక్స్ కి మామూలు క్రేజ్ ఉండదు. అలా అమెరికన్ పాప్ సింగర్ / డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కి ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జీవితం లో ఒక్కసారైనా ఈ లెజెండ్ లైవ్ పెర్ఫార్మన్స్ ని చూడాలనే కోరికతో ఆరోజుల్లో జనాలు ఉండేవారు. అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ లెజెండ్ బయోపిక్ గా హాలీవుడ్ లో ‘మైఖేల్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం లో మైఖేల్ జాక్సన్ పాత్రలో మైఖేల్ అల్లుడు ‘జాఫర్ జాక్సన్’ నటించాడు.

విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు , పాటలకు సంబంధించిన వీడియోలు చూసి , మైఖేల్ జాక్సన్ కిందకు దిగి వచ్చినట్టుంది , ఎవరీ కుర్రాడు అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్ లో పోలికలు కలవడానికి ప్రధాన కారణం , జాఫర్ జాక్సన్ స్వయంగా మైఖేల్ జాక్సన్ తో రక్త సంబంధం ఉండడం వల్లే. అయితే నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది . ముఖ్యంగా ఐమాక్స్ లో ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు , మైఖేల్ జాక్సన్ లైవ్ పెర్ఫార్మన్స్ మన ముందుకు వచ్చి ఇస్తున్నట్టుగా అనిపించిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్ వచ్చింది కానీ , ఇండియా వైడ్ గా మాత్రం గొప్ప ఓపెనింగ్స్ దక్కలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇండియా లో అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి కేవలం 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. కానీ నార్త్ అమెరికా లో మాత్రం ఈ చిత్రానికి మొదటి రోజున 40 మిలియన్ల డాలర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి వీకెండ్ లో 90 మిలియన్ డాలర్ల గ్రాస్ వస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని , వీకెండ్ కి కచ్చితంగా 200 మిలియన్ల డాలర్ల గ్రాస్ ని రాబడుతుందని , ఫుల్ రన్ లో 1 బిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper