TV5 Murthy new philosophy: పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అని పెద్దలు అంటారు. ఇప్పటికాలంలో ఇది వర్కౌట్ కాదని.. ఈ కాలంలో పైసామేతకు అసలు అర్థం లేదని టీవీ5 మూర్తి చెబుతున్నాడు. అంతేకాదు అలాంటి వారిని చూస్తే నాకు బాధ కలుగుతుందని వాపోతున్నాడు. ఇంతకీ టీవీ5 మూర్తి చెప్పిన ఆ ఫిలాసఫీ ఏంటంటే..
టీవీ 5 మూర్తి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు నచ్చిన విషయం గురించి ఓపెన్గా చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. పైగా కొన్ని కొన్ని విషయాలలో తన లైన్ దాటి మరి వ్యవహరిస్తున్నారు. డిబేట్ లలో తన పరిధి దాటి మరి మాట్లాడుతున్నారు. అందువల్లే ఆయన ఇటీవల కాలంలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నారు. గతంలో ఏపీలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మూర్తి మీద కేసులు కూడా నమోదు చేసింది. ఆ కేసులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వ వ్యవహారాల కంటే మిగతా విషయాలలో మూర్తి బిజీగా ఉన్నారు. ఇటీవల గౌతమి చౌదరి, ధర్మ మహేష్ వ్యవహారంలో మూర్తి డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. సవాల్ కూడా విసిరారు. అయితే దీనిపై మరో ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. వాటిపై మూర్తి క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇప్పుడు మూర్తికి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది. ఆ వీడియోలో చూపించిన దృశ్యాల ప్రకారం మూర్తి ఒక హోటల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు.. తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్న వారిని చూస్తే ఆయనకు బాధ కలుగుతుందట. నడుచుకుంటూ వెళ్లడం కంటే పరిగెత్తాలి కదా అంటూ ఆయన తనదైన జీవిత తత్వాన్ని బోధించారు. చివర్లో బిగ్గర గా ఒక నవ్వు కూడా నవ్వారు. సహజంగానే మూర్తి మాట్లాడిన ఈ వీడియో కూటమినేతలకు ఆనందం కలిగించవచ్చు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం దారుణంగా కామెంట్స్ చేస్తున్నాయి.
oreii Murthy gaa పరిగెత్త రా చిట్టి మా #rithuchowdhary ki #gowthamichowdary ki madhyalo ని పంచాయతీ ఏంటి రా #BiggBossTelugu9 https://t.co/TtPuJI8PWQ pic.twitter.com/wkoPZTdfqC
— భ్రమర (@SuryaKanthOnX) September 30, 2025