Homeటాప్ స్టోరీస్Chimpanzee War Uganda Ngogo: ఆ చింపాంజీల్లోనూ ఓ తింగరి ట్రంప్.. కట్ చేస్తే.. ఈ...

Chimpanzee War Uganda Ngogo: ఆ చింపాంజీల్లోనూ ఓ తింగరి ట్రంప్.. కట్ చేస్తే.. ఈ భూమండలంలోనే భీకర యుద్ధం

Chimpanzee War Uganda Ngogo: ఈ భూమండలం మీద పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. కొన్ని జాతులు అవతరించిపోయాయి. ఇంకా కొన్ని జాతులు తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాయి. యుద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచికి దారి తీయదు. ఆధిపత్యాలు.. భావజాలాలు.. పెత్తనం.. కండబలం.. బుద్ధి బలం.. ఇలా అన్నిటిని ప్రదర్శించుకునేందుకు జంతువుల నుంచి మనుషుల దాకా యుద్ధాలు జరిగాయి. ఆధునిక కాలంలో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని మరోవైపుకు తీసుకెళ్తున్నాయి. ఈ కథనం […]

Chimpanzee War Uganda Ngogo: ఈ భూమండలం మీద పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. కొన్ని జాతులు అవతరించిపోయాయి. ఇంకా కొన్ని జాతులు తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాయి. యుద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచికి దారి తీయదు. ఆధిపత్యాలు.. భావజాలాలు.. పెత్తనం.. కండబలం.. బుద్ధి బలం.. ఇలా అన్నిటిని ప్రదర్శించుకునేందుకు జంతువుల నుంచి మనుషుల దాకా యుద్ధాలు జరిగాయి. ఆధునిక కాలంలో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని మరోవైపుకు తీసుకెళ్తున్నాయి.

ఈ కథనం ప్రారంభంలో మనుషుల కంటే ముందు జంతువుల మధ్య యుద్ధం జరిగిందని ప్రస్తావించాం. వాస్తవానికి జంతువుల మధ్య యుద్ధం అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు డైనోసార్లు మనకు గుర్తుకొస్తాయి. వేల సంవత్సరాల క్రితం డైనోసార్లు యుద్ధాలు సాగించాయని.. మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. వాస్తవానికి డైనోసార్ల తర్వాత.. ఆధునిక కాలంలో.. ఈభూ మండలం మీద చింపాంజీలు భీకరమైన యుద్ధాన్ని చేశాయి. రెండు గ్రూపులుగా విడిపోయి హింసాకాండకు పాల్పడ్డాయి. ఒకదాన్ని ఒకటి చంపేసుకుని.. రాక్షసానందాన్ని పొందాయి.

ఆఫ్రికాలోని ఉగాండా ప్రాంతంలో కీపాలే నేషనల్ పార్క్ లో ఈ యుద్ధకాండ సాగింది. ఇక్కడ నేగోగో చింపాంజీలను గత మూడు దశాబ్దాలుగా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఆ చింపాంజీలు పరస్పరం దాడికి పాల్పడడం.. రెండు వర్గాలుగా విడిపోవడం వంటివి అరుదైన ఘటనలు అని పరిశోధకులు చెబుతున్నారు.

భీకరమైన ఈ చింపాంజీలు మొదట్లో స్నేహంగా ఉండేవి. మనుషుల మధ్య వచ్చినట్టు వీటి మధ్య కూడా అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో వాటి మధ్య గ్రూపులు పెరిగిపోయాయి. 2015 నాటికి వాటి మధ్య గ్రూపులు ఒక విభజనకు దారి తీసాయి. ఫలితంగా ఆ పార్కులో 2015లో చింపాంజీలు కొట్టుకోవడం మొదలుపెట్టాయ్. పరస్పరం దాడులు చేసుకున్నాయి. కేవలం మూడు అంటే మూడు సంవత్సరాల్లోనే అవి పశ్చిమ, ప్రాంతాలకు చెందిన చింపాంజీలుగా విడిపోయాయి. ఒక గుంపు.. మరొక గుంపు వేరువేరుగా ఉండడం మొదలుపెట్టాయి. చివరికి ఆహారం కోసం.. ఆశ్రయం కోసం ఒకే స్థాయి భూభాగాన్ని పంచుకోవడం కూడా మానివేశాయి.

ఈ ప్రకారం చూసుకుంటే ఒక గుంపు ఉన్న ప్రాంతంలో.. కలవడం లేదు. కనీసం ఎదురుపడితే పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నాయి. ఇవి ఇలా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గొడవల వల్ల ఇప్పటివరకు 28 చింపాంజీలు చనిపోయాయి. ముఖ్యంగా 2021 నుంచి 2024 వరకు దాదాపు 14 చింపాంజీలు చనిపోవడం లేదా అదృశ్యమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ చింపాంజీల యుద్ధం దాదాపు పది సంవత్సరాలపాటు నిరాటంకంగా సాగింది. చివరికి మధ్య ప్రాంత బృందంపై పశ్చిమ ప్రాంత బృందం ఆధిపత్యాన్ని సాధించింది. మగ చింపాంజీలు అత్యంత దారుణంగా దాడులకు పాల్పడ్డాయి. వాస్తవానికి చింపాంజీలు దాడి చేస్తున్నప్పుడు గట్టిగా అరుస్తుంటాయి. కానీ మగ చింపాంజీలు నిశ్శబ్దాన్ని పాటించి ఘోరమైన దాడులకు పాల్పడ్డాయి. మగ చింపాంజీలు ముకుమ్మడిగా దాడి చేసి.. ప్రత్యర్థి చింపాంజీలను క్రూరంగా చంపేశాయి. వాస్తవానికి చింపాంజీలలో ఇంతటి పరిణామం ఏర్పడేందుకు బలమైన విభజన ఉండి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

పరిశోధకుల వివరాల ప్రకారం ఒక చింపాంజీ గ్రూపులో దాదాపు 50 వరకు ఉంటాయి. కానీ నెగో గో లో మాత్రం 200 వరకు ఉన్నాయి. ఇవి విపరీతంగా పెరగడం వల్ల.. సామాజిక బంధాల ఏర్పాటులో ఒత్తిడి పెరిగింది. ఆహారం.. లైంగిక భాగస్వామి కోసం పోరాటం వంటి వాటి వల్ల విభజన రేఖ ఏర్పడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చింపాంజీల మధ్య ఈ భీకరమైన యుద్ధం ఒక రక్త చరిత్రగా మారిపోయింది. అయితే ఒక ట్రంప్ లాంటి వ్యవహార శైలి ఉన్న చింపాంజీ ఉండి ఉంటుందని.. అందువల్లే ఈ స్థాయిలో వాటి మధ్య విభజన రేఖ ఏర్పడి ఉంటుందని కొంతమంది వ్యంగ్యంగా విశ్లేషిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper