Tiger Attack: డిస్కవరీ ఛానల్ లో క్రూరమైన పులులు ఇతర జంతువులపై దాడి చేస్తాయి. అమాంతం మీద పడి తినేస్తుంటాయి. తమకు లొంగని జంతువులను వేటాడి వేటాడి చంపేస్తాయి. వాస్తవానికి పులి అనేది అత్యంత క్రూరమైన జంతువు. దానికి ఏమాత్రం కనికరం ఉండదు. ఆకలిగా ఉంటే మాత్రం ఎంత పెద్ద జంతువైనా సరే దాని ముందు తలవంచాల్సిందే. పైగా పులి నీటిలో ఉండే మొసలి నుంచి మొదలు పెడితే చెట్టు మీద ఉండే కోతి వరకు దేనిని కూడా వదిలిపెట్టదు
పులిని చూస్తే అత్యంత గంభీరంగా ఉంటుంది. దానిని దూరం నుంచి చూస్తేనే ఒంట్లో ఒక రకమైన భయం పుడుతుంది.. అటువంటిది ఆ వ్యక్తి పులిని నేరుగా చూశాడు.. చూసే లోగానే అది అమాంతం మీద పడిపోయింది. తన పదునైన దంతాలతో గొంతును పట్టేసుకుని లాక్కుని పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా కలకలం సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో మహారాష్ట్రలోని బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతం చంద్రపూర్ జిల్లాలో ఉంటుంది. చంద్రపూర్ జిల్లాలో దట్టమైన అడవులు ఉంటాయి. బ్రహ్మపురి ప్రాంతం కూడా దట్టమైన అడవుల్లో ఒక భాగం. అయితే ఇక్కడికి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సెక్యూరిటీగా ఓ వ్యక్తి ఉన్నాడు. తన విధుల్లో భాగంగా అతడు బయట కూర్చుని ఉన్నాడు.. పైగా అది రాత్రి సమయం.. ఇంతలోనే గోడ నుంచి ఒక పులి దూకి వచ్చింది.. ఆ వ్యక్తి తేరుకునే లోపే అమాంతం మీద పడింది. పంజా దెబ్బను రుచి చూపించింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని లాక్కుని వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఆకలిగా ఉన్న పులి ఇలా దాడి చేసి అతడిని చంపేసిందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ వీడియో నిజం అని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదట. సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయిన తర్వాత.. ఈ వీడియో గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.. అయితే అందులో వాస్తవం లేదని తెలిసింది.. కొంతమంది వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోని రూపొందించినట్లు సమాచారం. ఫారెస్ట్ ఆఫీసు వద్ద సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి కదలికలను కదలికలు సీసీటీవీలలో రికార్డయ్యాయి. ఆ వీడియోను సంపాదించిన కొంతమంది వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పులి దాడి చేసినట్టు రూపొందించారు.