Pini Village : ఆ ఐదు రోజులు.. ఆడవాళ్ళ ఒంటి పై నూలు పోగు ఉండదు.. బాబోయ్ ఇదేం ఆచారం?

Pini Village అయితే నగ్నంగా మహిళలు ఉన్న ఆ ఐదు రోజులు గ్రామానికి ఇతరులను రానివ్వరట. సరిహద్దుల వద్ద పురుషులు కాపలా కాస్తారట. చివరికి బంధువులు, దగ్గరి వాళ్ళను కూడా అనుమతించరట.

Written By: NARESH, Updated On : June 14, 2024 10:23 pm

Womens with no dress Village

Follow us on

Pini Village : ఈ ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. మరెన్నో విశేషాలున్నాయి.. గతంలో వీటి గురించి అంతగా తెలిసేది కాదు. సోషల్ మీడియా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత.. ఆశ్చర్య పోవడం మనవంతవుతోంది.. ఇందులో కొన్ని ఆచారాలు వింతగా ఉంటే.. మరికొన్ని ఆచారాలు ఎబ్బెట్టు కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి ఆచారం ఒకటి మన దేశంలో ఉందట.. అది ఇటీవల వెలుగులోకి వచ్చింది.. ఇంతకీ అది ఏంటంటే..

ఆ ఆచారం గురించి మీరు చదివిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో సోషల్ మీడియాలో వెతుకుతుంటారు. లేదా గూగుల్ తల్లిని అడుగుతుంటారు. ఇంతకీ ఆ ప్రాంతం మరెక్కడో కాదు.. హిమాలయాలకు దగ్గరలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.. ఈ రాష్ట్రంలోని కులు జిల్లాలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారు. పైగా ఇది వారి తరతరాల ఆచారమని చెబుతున్నారు. ఇలా నగ్నంగా ఉంటే ప్రకృతికి గౌరవం ఇచ్చినట్టు వారు భావిస్తారట.. వారి ఆరాధ్య దైవానికి నగ్నంగానే పూజలు చేస్తారట. ఇలా నగ్నంగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలిని, పరిశుద్ధమైన సూర్య కాంతిని, సహజ వాతావరణాన్ని ఆలింగనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందట. దీనివల్ల భౌతిక శక్తులు శరీరానికి మంచి చేస్తాయట. ఎటువంటి వ్యాధులు, ఇతర రుగ్మతలు దరి చేరవట. పైగా శరీరం మరింత రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుందట.. నగ్నంగా ఉంటే భౌతిక పరమైన కోరికలపై అదుపు ఉంటుందట. గ్రామం మొత్తం మహిళలు ఇలానే చేస్తారట.

ఇలా నగ్నంగా ఉండడం వల్ల మహిళలు తమ అంత : శుద్ధి చేసుకున్నట్టు భావిస్తారట. ఇలా నగ్నంగా ఉండి తమ ఆరాధ్య దైవానికి పూజలు చేస్తే కరుణిస్తుందట. దీనివల్ల ఊరికి మంచి జరుగుతుందట. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని వారు భావిస్తారట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. ఆ గ్రామం గురించి చాలామంది గూగుల్ లో శోధిస్తున్నారు. అయితే నగ్నంగా మహిళలు ఉన్న ఆ ఐదు రోజులు గ్రామానికి ఇతరులను రానివ్వరట. సరిహద్దుల వద్ద పురుషులు కాపలా కాస్తారట. చివరికి బంధువులు, దగ్గరి వాళ్ళను కూడా అనుమతించరట.