Papua New Guinea vs Afghanistan : టి20 వరల్డ్ కప్ లో ఏమాత్రం అంచనాలు లేని ఆఫ్ఘనిస్తాన్ సూపర్ -8 కు వెళ్లిపోయింది. శుక్రవారం ట్రిని డాడ్ టొబాగో వేదికగా పపువా న్యూ గినియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ -8 లోకి దర్జాగా వెళ్ళిపోయింది. ఈజ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. కిప్లిన్ 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ల బౌలర్లలో ఫజల్లా ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టాడు. నవీన్ వుల్ రెండు వికెట్లు సాధించాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.. ఆఫ్ఘనిస్తాన్ 15.1 ఓవర్లలో, మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో నైబ్ 49*పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మహమ్మద్ నబీ 16 పరుగులతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్లో పపువా న్యూ గినియా ఆటగాళ్లు నలుగురు రన్ అవుట్ అయ్యారు.. అసాద్ 3, చాద్ 9, నార్మన్ 0, సెమో 2 రన్ అవుట్ రూపంలో పెవిలియన్ చేరుకున్నారు.. ముఖ్యంగా నార్మన్ అవుట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన 13 ఓవర్ తొలి బంతికి నార్మన్ రన్ అవుట్ అయ్యాడు. ఈ బంతికి మిడ్ ఆన్ మీదుగా షాట్ కొట్టేందుకు నార్మన్ యత్నించాడు. సింగిల్ రన్ కోసం ప్రయత్నించాడు. అక్కడే ఉన్న రషీద్ ఖాన్ బంతిని అందుకుని వెంటనే వికెట్ల వైపు త్రో విసిరాడు. బంతి స్టంప్ ను తగిలేలోగా అతడు క్రీజ్ లోకి వచ్చేసాడు. అయితే క్రీజ్ కు ఇంచు దూరంలో అతడి బ్యాట్ ఆగిపోయింది. ఈ లోపు బంతి వికెట్లను పడగొట్టింది.. ఫలితంగా నార్మన్ నిరాశతో వెను తిరగాల్సి వచ్చింది.
టి20 క్రికెట్ చరిత్రలో నలుగురు ఆటగాళ్లు రనౌట్ కావడం దాదాపు ఇదే తొలిసారి. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పపువా న్యూ గినియా జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు రన్ అవుట్ కావడం పట్ల నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ” దరిద్రాన్ని అంత దగ్గరగా ఆహ్వానించినప్పుడు.. ఇలానే జరుగుతుంది. ఇలాంటప్పుడు చేసేది ఏమీ ఉండదు. జస్ట్ చూస్తూ ఉండిపోవడమేనంటూ” నెటిజన్లు ఏకిపడేస్తున్నారు.
Oh #PNG Novman find himself the reason to get run out @rashidkhan_19 won’t be missing it from such a short distance but you will have to feel for the batter – Third run out @ACBofficials #AFGvsPNG pic.twitter.com/WzUEKqJbBD
— Ahmad Farhad Fidai (@AhFarhadFidai) June 14, 2024