Karun Nair Career: అప్పట్లో త్రిబుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకానొక దశలో వీరేంద్ర సెహ్వాగ్ ను రికార్డును బద్దలు కొడతాడని అంచనాలు పెంచుకునేలా చేశాడు.. కానీ ఆ తర్వాత అనేక అవకాశాలు వచ్చినప్పటికీ తేలిపోయాడు. ఐపీఎల్ లో నాయర్ అదరగొట్టిన నేపథ్యంలో.. అతనిపై జట్టు మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసింది.
Also Read: ఐదో టెస్టులో రిషబ్ పంత్ అనుమానమే.. అతని స్థానంలో ఆడేది ఎవరంటే?
ఇంగ్లాండ్ సిరీస్ లో నాయిర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా నెంబర్ 3 లో బ్యాటింగ్ కు వచ్చిన అతడు జట్టుకు ఉపయోగపడే ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. అతనిపై నమ్మకం ఉంచిన జట్టు మేనేజ్మెంట్ రెండు, మూడో టెస్టులో అవకాశం ఇచ్చినప్పటికీ.. అతడు ఉపయోగించుకోలేకపోయాడు.. దీంతో అతడిని నాలుగో టెస్ట్ కు మేనేజ్మెంట్ దూరం పెట్టింది. అతని స్థానంలో సాయి సుదర్శన్ కు అవకాశం ఇచ్చింది.
వాస్తవానికి రెండో టెస్టులో లాయర్ 31, 26 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో అతని మీద నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ లార్డ్స్ టెస్టులో అవకాశం వచ్చింది. అతడు 40 పరుగులు చేసి ఓకే అనిపించాడు. రెండవ ఇన్నింగ్స్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనిపై సోషల్ మీడియా లో విమర్శలు వచ్చాయి. వరుస అవకాశాలు కల్పించినప్పటికీ వినియోగించుకోలేకపోవడంతో అతని జట్టు నుంచి దూరం పెట్టాలని అభిప్రాయపడ్డారు. అంతే కాదు సాయి సుదర్శన్ కు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.. దీంతో మేనేజ్మెంట్ కూడా పునరాలోచనలో పడింది. సాయి సుదర్శన్ కు అవకాశం ఇచ్చింది. అతడు నాలుగో టెస్టులో ఏకంగా 61 పరుగులు చేశాడు. భారత జట్టు తరఫున హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు సాయి సుదర్శన్ ఇదే నిలకడైన ఆట తీరు ప్రదర్శిస్తే గొప్ప ఆటగాడు అవుతాడని ఇప్పటికే నవజ్యోత్ సింగ్ సిద్దు వ్యాఖ్యానించడం విశేషం.
నాలుగో టెస్ట్ లో ఆడే అవకాశం లభించకపోవడంతో నాయర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.. రాహుల్ ను పట్టుకొని బ్లూ జెర్సీ వేసుకున్న నాయర్ ఏడుస్తున్నట్లు ఓ వీడియో కనిపిస్తోంది. దీంతో అతడు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఎందుకంటే ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికినప్పుడు టీమిండియా స్పిన్ బౌలర్ అశ్విన్ విరాట్ కోహ్లీని ఆలింగనం చేస్తున్నాడు. ఇప్పుడు నాయర్ కూడా కేఎల్ రాహుల్ తో అలానే ప్రవర్తించాడు. పైగా అశ్విన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మధ్యలోనే తన రిటర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు నాయర్ కూడా అలానే ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారికంగా నాయర్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.