Shobha Shetty Interview: సీరియల్ నటుడు యస్వంత్ తో రిలేషన్ లో ఉన్న శోభా శెట్టి(SHOBHA SHETTY) అతడితో గోవా వెళ్లిందట. అప్పుడు వారి మధ్య చోటు చేసుకున్న రొమాంటిక్ విషయాలు షేర్ చేసింది. అలాగే పెళ్లి ఎప్పుడు? ఒకప్పుడు ఆర్థికంగా ఎంతటి దుర్భర స్థితి చూసిందో బయటపెట్టింది..
Also Read: భార్య విడాకులు.. 100 బీర్లు తాగాడు.. చివరికి ఈ భర్తకు ఏమైందంటే?
కార్తీక దీపం సీరియల్ లో శోభా శెట్టి చేసిన మోనిత పాత్ర బుల్లితెర ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. విలనిజం లో శోభా శెట్టి పీక్స్ చూపించింది. ఆ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఎంత ఫేమస్సో… మోనిత పాత్ర కూడా అనే ఫేమస్. ఏళ్ల తరబడి సక్సెస్ఫుల్ గా కార్తీక దీపం సీరియల్ నడిచింది. కార్తీక దీపం నవవసంతం పేరుతో ప్రస్తుతం మరో వెర్షన్ కూడా ప్రసారం అవుతుంది. అయితే మోనితకు అవకాశం దక్కలేదు. విలన్ రోల్ మరో నటి చేస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(BIGG BOSS TELUGU)లో పాల్గొన్న శోభా శెట్టి కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ లో కూడా శోభా శెట్టి ఫైరే అని ఆ షోలో వెల్లడైంది. తనకు నచ్చని కంటెస్టెంట్స్ మీద విరుచుకుపడేది. శోభా శెట్టి గేమ్ తీవ్ర విమర్శలపాలైంది. ఆమెను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. అయితే స్టార్ మా సీరియల్ బ్యాచ్ కావడంతో కాపాడుతూ వచ్చారు. షోకి అలాంటి కాంట్రవర్సీ కంటెస్టెంట్స్ కావాలని, అందుకే ఎలిమినేట్ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
శోభా శెట్టి ఫైనల్ కి ముందు ఎలిమినేట్ అయ్యింది. ఆమెకు ఫైనలిస్ట్ హోదా దక్కలేదు. బయటకు వచ్చాక తనకు ఎంత నెగిటివిటీ వచ్చిందో తెలుసుకున్న శోభా శెట్టి క్షమాపణలు చెప్పింది. నేను ఏం చేసినా గేమ్ లో భాగమే. మీ మనసులను బాధించి ఉంటే క్షమించండి అని వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం శోభా సీరియల్స్ చేయడం లేదు. కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న శోభా, అక్కడ సైతం కాంట్రవర్సీ రాజేసింది. ఇదిలా ఉండగా.. సీరియల్ నటుడు యస్వంత్ ని ప్రేమిస్తున్నట్లు బిగ్ బాస్ షో వేదికగా పరిచయం చేసింది. వీరు రిలేషన్ లో ఉన్నారు.
జబర్దస్త్ వర్ష కిస్సిక్ టాక్ షో పేరిట ఓ షో హోస్ట్ చేస్తుంది. ఈ షోకి గెస్ట్ గా హాజరైన శోభా శెట్టిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోల గురించి అడిగింది. యస్వంత్ తో గోవా వెళ్ళినప్పుడు అనుకోకుండా వర్షం పడింది. ఆ ఫోటోలు యశ్వంత్ నే స్వయంగా తీశాడు, అని చెప్పింది. యశ్వంత్ చాలా రొమాంటిక్ అని వర్ష ఆశ్చర్యపడింది. మరి పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. 2025లో చేసుకోవాలని ప్లాన్ చేశాము. యశ్వంత్ నా ప్రేమను అంత ఈజీగా ఒప్పుకోలేదు. తాను లేకపోతే నాకు లైఫ్ లేదని చెప్పుకొచ్చింది. కెరీర్ బిగినింగ్ లో ఆడిషన్స్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని, అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టి, అద్దె ఇంట్లో దిగామని, ఎయిర్ పోర్ట్ లోనే నిద్రపోయిన సందర్భాలు అనేకం అంటూ.. తన బాధలు చెప్పుకొచ్చింది.