Smart Bottle Cap: ఒకప్పుడు బావుల్లో నీరు తాగేవారు.. కొంతకాలానికి బోర్లు వచ్చాయి. ఇప్పుడు మినరల్ వాటర్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కొందరి ఇంట్లో అయితే ఆల్కలైన్ వాటర్, హిమాలయాల నుంచి సేకరించిన నీటిని తాగడం పెరిగిపోయింది. అయితే మెజారిటీ వర్గాలు
నేటి కాలంలో మినరల్ వాటర్ తాగుతున్నారు.. గ్రామాలలో ఆర్ఓ ప్లాంట్లు వచ్చాయి. దీని ద్వారా మిడిల్ వాటర్ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది..
Also Read: సింహానికే చుచ్చుపోయించిన అడవి దున్న.. బాహుబలి రేంజ్ లో సీన్.. వీడియో
దూర ప్రాంతాలకు వెళ్లేవారు.. దాహాన్ని తట్టుకోలేక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు. అలా తాగే నీరు మినరల్ అని అందరూ అనుకుంటారు. పైగా కొన్ని బ్రాండ్ల బాటిల్స్ మాత్రమే కొనుక్కుని తాగడం చాలామందికి అలవాటు. అలాంటి నీటిని తాగే సమయంలో.. బాటిల్ పైన ఉన్న మూతను చాలామంది పరిశీలించరు. మూతను తొలగించి నీటిని తాగుతారు. బాటిల్ పైన ఉన్న మూత రంగు మనం ఏం తాగుతున్నామో చెబుతుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
ఉదాహరణకు మీరు తాగే వాటర్ బాటిల్ పైన మూత బ్లూ కలర్ లో ఉంటే.. అందులో ఉన్న నీరు నూటికి నూరు శాతం శుద్ధి చేసిందని అర్థం..
వాటర్ బాటిల్ పైన మూత తెలుపు రంగులో ఉంటే.. అందులో ఉన్న నీటిని ఫ్యాక్టరీలో శుద్ధి చేశారని అర్థం.
బాటిల్ మూత ఎరుపు రంగులో ఉంటే.. అందులో ఎలక్ట్రోలైట్స్ కలిపారని అర్థం. ఇటువంటి ఎరుపు రంగు మూత ఉన్న బాటిల్స్ ను అథ్లెట్స్ వాడుతుంటారు. వారు ఆడే క్రమంలో త్వరగా నిర్జలీకరణకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. శరీరంలో లవణాల శాతం పెంచుకోవడానికి ఎరుపు రంగు మూత ఉన్న బాటిల్లో నీటిని తాగుతారు.
బాటిల్ మూత గ్రీన్ కలర్ లో ఉంటే.. అందులో ఉన్న నీటిలో తీపి పదార్థాలు కలిపారని అర్థం. కొన్ని రకాల కూల్ డ్రింక్స్ బాటిళ్ల మూతలు గ్రీన్ కలర్ లో ఉంటాయి.. కొన్ని రకాల వాటర్ బాటిల్స్ మూతలు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటాయి.
కొన్ని వాటర్ బాటిల్ మూతలు నలుపు రంగులో కనిపిస్తుంటాయి. ఇందులో ఉన్న నీళ్లు ఆల్కలైన్ సంబంధితమైనవి. మన దేశంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ నీటిని తాగుతాడు.
Also Read: డబ్బులు, బంగారం.. సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇదిగో ఇలా సులువుగా వచ్చేస్తాయి..
మనదేశంలో మినరల్ వాటర్ వ్యాపారం 9వేల కోట్లు అని తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలలో మినరల్ వాటర్ అనేది అవ్యవస్థీకృత రంగంలో ఉంది కాబట్టి.. ఈ వ్యాపారం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. స్థూలంగా చూస్తే మనదేశంలో మారుమూల గ్రామాలను కలుపుకుంటే.. దాదాపు 15వేల కోట్ల వరకు మంచినీటి వ్యాపారం జరుగుతుందని అంచనా..