Revanth Reddy Facial Recognition Incident: ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా జీతం తీసుకున్న ఘటన ఇటీవల జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ తీసుకువస్తోంది. ఇప్పటికే గురుకులాల్లో విద్యార్థులకు అమలులో ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో, విద్యాశాఖలో ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే మన ప్రభుత్వ ఉద్యోగులు మామూలోళ్లు కాదు కదా.. ఏకంగా ఫేషియల్ రికగ్నేషన్‌నే చీటింగ్ చేయగలమని నిరూపించాడు జగిత్యాల జిల్లాకే చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించి అటెండెన్స్ నమోదు చేసిన ఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది. విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ నమోదు చేస్తున్నారు.
Also Read : వదిలేదేలే.. టీచర్లకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ సర్కార్
టెక్నాలజీ దుర్వినియోగం..
పంచాయతీ కార్యదర్శుల హాజరును గ్రామాల నుంచే నమోదు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే, కొందరు కార్యదర్శులు ఈ వ్యవస్థను ఏమాత్రం ఉపయోగించకుండా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటోను అప్‌లోడ్ చేయడం, ఖాళీ కుర్చీల చిత్రాలను పెట్టి చీటింగ్ చేస్తున్నారు. ఇది సాంకేతికత దుర్వినియోగంతోపాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని బయలపెట్టింది.
Also Read: సంధి కుదిరింది.. రేవంత్ కు నవ తెలంగాణ “ఎర్రతివాచీ”..
ఇలా బయటపడింది..
రోజూ ఒకే ఫోటోలు అప్‌లోడ్ అవుతుండడంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ పరిశీలనలో జగిత్యాల జిల్లాలో ఒక కార్యదర్శి రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ నమోదు చేసిన విషయం బయటపడింది. ఇతరుల సహాయంతో విధులకు హాజరు కాకుండా అటెండెన్స్ వేసుకున్న ఘటనలు, ఖాళీ కుర్చీల ఫొటోలతో మోసాలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన సాంకేతికత ఒక్కటే సమస్యలను పరిష్కరించలేదని నిరూపించింది. సాంకేతిక వ్యవస్థలు ఎంత అధునాతనమైనవైనా, వాటిని అమలు చేసే వ్యక్తుల నీతి, బాధ్యతగా లేకపోతే విఫలమవుతాయి.