Wild Buffalo vs Lion: మనుషుల్లో అయినా.. జంతువుల్లో అయినా.. తమదే పై చేయి ఉండాలని చాలామందికి ఆరాట ఉంటుంది. ఈ పై చేయి కోసం ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు. ఈ పోరాటాల్లో కొందరు విజయం సాధించగా.. మరికొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆధిపత్యం కోసం పోరాటం ఎన్నటికైనా ఫలిస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. మనసుల విషయం పక్కకు పెడితే.. జంతువుల్లో ఆధిపత్యం ఎప్పుడూ ఒక్కరిదే ఉండదు అన్న విషయం తెలుసుకోవాలి. వీటిలో కూడా పోరాటపాటిమ ఏర్పడినప్పుడు ఎదుటివారిని ఓడించే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సందర్భాలు మనం నేరుగా చూడకుండా కొన్ని వీడియోలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతుంది.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే?
Also Read: ఈ పండు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోతారు.. జాగ్రత్త..
అడవికి రాజు ఎవరంటే.. విద్యార్థుల సైతం చెబుతారు సింహం అని. సింహం గర్జిస్తే ఏ జంతువు అయినా వనికి పోవాల్సిందే. అంతేకాకుండా సింహం తనకు నచ్చిన జంతువును చంపి తినేయగలరు. ఎదుటి జంతువు చిన్నదైనా.. భారీ ఆకారం కలిగినదైనా.. చంపి తినడానికి ఏమాత్రం వెనకాడదు. కానీ అన్నివేళలా విజయం తమదే అంటే కుదరదు. ఒక్కోసారి ఎదుటివారిలో కూడా ధైర్యం ఏర్పడితే సింహరాజుకైనా.. వెనుకడుగు వేయక తప్పదు. అలా ఓ సందర్భంలో ఒక దున్నను తినబోయేందుకు సింహం ప్రయత్నించగా.. అందుకు ఆ దున్న ఎదురు దాడి చేసింది..
సాధారణంగానే సింహంకు ఆకలి వేసినప్పుడు తనకు దొరికిన ప్రతి జంతువును తింటూనే ఉంటుంది. అలా మృగరాజుకు ఒకసారి అడవి దున్న కనిపించింది. దీంతో తన ఆకలి తీరినట్టేనని అనుకుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ దున్నపై దాడి చేయబోయింది. అయితే ఆ దున్న తనను కాపాడుకోవడానికి.. తీవ్రంగా ప్రయత్నించింది. సింహానికి రాజు అయితే ఏంది? నేను పోరాడగలను.. అంటూ ఎదురు దాడికి దిగింది. అయినా సింహం అడవి దున్న ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి దున్న చూపించే ధైర్యానికి సింహం వెనుకడుగు వేయక తప్పలేదు.
Also Read: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?
ఈ వీడియో ఏం తెలుపుతుందంటే? ఎప్పటికైనా ఆధిపత్యం ఒక్కరిదే ఉండదు.. స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి కానీ.. ఎలుక కూడా రాజ్యం వెళుతుందని కొందరు చమత్కరిస్తారు. అలాగే మనుషుల్లో కూడా ఎప్పుడూ ఒక్కరిదే అంటే కుదరదు.. కొన్నాళ్లపాటు వారి హవా నడిచినా.. ఆ తర్వాత వారికి ఎదురు దాడి దిగడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అందువల్ల ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు.. అది న్యాయమైన కోరిక అయితే.. దానికోసం కచ్చితంగా ధైర్యంగా పోరాడుతూనే ఉండాలి. ఇలా చివరి వరకు ప్రయత్నిస్తే.. ఎప్పటికైనా విజయం అవుతూనే ఉంటుంది. అలాకాకుండా భయపడి ఎదుటివారికి లొంగిపోయే మనస్తత్వం ఉంటే ఎప్పటికీ బానిసల్లాగానే ఉండిపోతారు.