Relationship : మెరిసేదంతా బంగారం కాదు అంటారు కదా.. సోషల్ మీడియాలో కనిపించేవన్ని నిజాలు కాదు. అందులో చూసేవన్ని యదార్థాలు కావు. ఏవో పై పూత.. పై రంగులు వేసుకొని సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తులు కనిపిస్తుంటారు. అసలు విషయాలను దాస్తారు. మాటలతో మాయ చేస్తారు. చేతలతో రెచ్చగొడతారు. చివరికి ఎదుటివారిని ముగ్గులోకి దించిన తర్వాత.. మైకంలో పడేసిన తర్వాత అసలు రూపాన్ని చూపిస్తారు. అందుగురించే సోషల్ మీడియాను ఎంతవరకు వాడాలో.. ఎంతవరకు ఉపయోగించుకోవాలో కాస్త తెలిసి ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత చింతించి ఉపయోగం ఉండదు. విలపించి ప్రయోజనం ఉండదు. బాధపడి లాభం ఉండదు.. ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురయింది. చివరికి అతను చేసిన పని సోషల్ మీడియాలోనే పడి వైరల్ అయింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..
Also Read : ఇదేం విడ్డూరం.. చెట్లను మొక్కలుగా మార్చుతున్నారు.. ఇదెలా సాధ్యం?
అతడి వయసు 26..
ఆ వ్యక్తి పేరు బయటికి చెప్పలేదు. వెల్లడించడానికి ఆసక్తి చూపించలేదు. అతడి వయసు 26 సంవత్సరాలు. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు దాదాపు నాలుగు అంకెల వరకు వేతనం వస్తుంది. పర్వాలేదు అనే స్థాయిలోనే ఆర్థిక పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. కుర్రాడు కాబట్టి కొంచెం దూకుడు మీదనే ఉంటాడు. తన సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంతో ఓ యువతీ నుంచి మెసేజ్ వచ్చింది. మొదట్లో మనవాడు దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత లోతుగా వెళ్ళాడు. ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమె కూడా మనవాడి ఆసక్తిని గమనించి ముగ్గులోకి దింపింది. స్వయంగా ఆడపిల్ల తన అంగీకారం తెలిపితే.. మగాన్ని.. పైగా పడుచు కుర్రాన్ని అనే భావనలో ఇతడు కూడా ఓకే చెప్పాడు. మొత్తానికి రెండు బండ్లు కూడా పట్టాలెక్కాయ్. మాటల ప్రవాహం సాగుతోంది. సందేశాల పరంపర దర్జాగా నడుస్తోంది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య వయసుకు సంబంధించిన చర్చ వచ్చింది. ఆమె తన వయసు ముందు 27 సంవత్సరాలు అని చెప్పింది. అది మనోడికి షాక్ కలిగించింది. ఒక సంవత్సరం తేడా కదా అని మనోడు సర్దుకున్నాడు. ఆ తర్వాత మనోడు ఇంకా గుచ్చి గుచ్చి అడిగితే 48 సంవత్సరాలు అని చెప్పింది. దీంతో మనోడి గుండె ఆగినంత పని అయింది.. ఇదే విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.” ఆమె మాటలతో నేను కరిగిపోయాను. ఆమె స్నేహితులు 30 ప్లస్ వాళ్లే ఉండేవారు. నాకు మొదట్లో అది అనుమానం అనిపించేది. ఆ తర్వాత ఆమె మాటలు విన్న తర్వాత నా మనసులో ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టే వారిని. ఏదైనా డాక్యుమెంట్స్ అడిగితే అసలు ఇచ్చేది కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఇలా మారింది. దాదాపు 12 సంవత్సరాలు నాకంటే ఆమె పెద్ద. ఇలాంటి స్థితిలో నా ప్రేమను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. తదుపరి దశలో ఎలా దాన్ని బలోపేతం చేసుకోవాలని” ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానిని చూసిన నెటిజన్లు ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. మరికొందరేమో సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కామన్.. పక్కనపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడమే అంటూ అతడికి సూచనలు చేస్తున్నారు. “48 సంవత్సరాల మహిళ నిన్ను ట్రాప్ లో పెట్టిందంటే మామూలు విషయం కాదు. ఇప్పటికైనా నువ్వు తప్పు కూడా మంచిదని” కొంతమంది అతడికి సలహాలు ఇస్తున్నారు.