Shiva Rajkumar : కన్నడ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆధారాభిమానాలను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు శివ రాజ్ కుమార్(Shivarajkumar). మన టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాగో, కర్ణాటక లో రాజ్ కుమార్ కూడా అలా అన్నమాట. ఆయన చేయని పాత్ర అంటూ ఏది మిగలలేదు. కన్నడ ప్రేక్షకులు ఆయన్ని దేవుడి లాగా కొలుస్తారు. ఆయన కొడుకులుగా శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ హీరోలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. శివ రాజ్ కుమార్ నిన్నటి తరం సూపర్ స్టార్, కానీ పునీత్ రాజ్ కుమార్ నేటి తరం సూపర్ స్టార్. కర్ణాటక ప్రాంతంలోకి వెళ్తే ఎక్కడ చూసినా పునీత్ రాజ్ కుమార్ కటౌట్స్, బ్యానర్స్, ఫోటోలు కనిపిస్తాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ దురదృష్టం కొద్దీ మూడేళ్ళ క్రితం గుండెపోటు తో చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది.
Also Read : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!
రీసెంట్ గానే శివ రాజ్ కుమార్ కూడా క్యాన్సర్ బారిన పడ్డాడు. కానీ మెరుగైన వైద్యంతో ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా బయటపడ్డాడు. రీసెంట్ గానే ఆయన ఉపేంద్ర(Upendra) తో కలిసి ’45’ అనే చిత్రం లో నటించాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఉపేంద్ర తో పాటు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆగస్టు 15 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. అయితే ఈ ఈవెంట్ లో శివ రాజ్ కుమార్ ని రిపోర్టర్ ‘మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది సార్’ అని అడగగా, దానికి శివ రాజ్ కుమార్ సమాధానం చెప్తూ చాలా బాగుంది, 20 రోజుల క్రితమే హైదరాబాద్ లో రామ్ చరణ్ గారి ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే నేడు శివ రాజ్ కుమార్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తన ఇంటి వద్ద ఒక చిన్న పిల్లడు సైకిల్ ని తొక్కడాన్ని చూసి, అతన్ని ఆపి, శివరాజ్ కుమార్ సైకిల్ ని అత్యంత వేగంగా తొక్కాడు. మధ్యలో ఆయన ఆ సైకిల్ తో జీరో కట్స్ కూడా వేసాడు. అనంతరం మళ్ళీ ఆ సైకిల్ ని ఆ పిల్లాడికి ఇచ్చి, కాసేపు ప్రేమగా అతనితో మాట్లాడి పంపించాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గానే ఆపరేషన్ అయ్యినప్పటికీ, శివన్న లో జోష్ ఏ మాత్రం తగ్గలేదని, ఈ వయస్సు లో ఇంత యాక్టీవ్ గా ఉండడం అనేది సాధారణమైన విషయం కాదంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు నెటిజెన్స్.
Senior Kannada actor Shiva Rajkumar, who recently recovered from cancer, took a bicycle from a kid and rode it with joy.
He is currently doing a key role in the #Peddi film starring @AlwaysRamCharan, directed by Buchibabu Sana. pic.twitter.com/QIhvidPifO
— Telugu Chitraalu (@TeluguChitraalu) April 18, 2025