House : సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలలో సొంత ఇల్లు ఒకటి ఉంటుంది. అయితే చాలామంది డబ్బు పొదుపు చేసిన తర్వాత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేస్తూ ఉంటారు. అలా చేస్తే వయసు అయిపోయి అప్పుడు ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉండదు. అందువల్ల ప్రస్తుత కాలంలో చాలామంది యువత ఉద్యోగాలు పొందిన వెంటనే ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఇల్లును కాకుండా ఇతర పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు తప్పనిసరి అని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏ వయసులో ఇల్లు కొనుగోలు చేస్తే మంచిదో వారు వివరించారు. ఆ వివరాలు కి వెళితే.
Also Read : సొంత ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి..
ఒకప్పుడు చదువు పూర్తయి ఉద్యోగాలు సాధించే వరకు 30 ఏళ్ల వయసు వచ్చేది. ఆ తర్వాత పైసా పైసా కూడబెట్టి జీవితాన్ని నడిపిస్తూ ఇల్లు నిర్మించుకోవాలంటే 50 ఏళ్ల వయసు వచ్చేది. కానీ ఇప్పుడు 21 ఏళ్లకే యువత ఉద్యోగాలు పొందుతున్నారు. ఊహించని ఆదాయాన్ని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు వచ్చిన ఆదాయంలో సగం వరకు వృధాగా ఖర్చు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇతర పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సొంత ఇల్లు కావాలని అనుకునేవారు మాత్రం చిన్నవయసులోనే పెట్టుబడులు పెట్టుకోవడం అవసరమని అంటున్నారు.
ఉద్యోగం వచ్చినా వెంటనే ఇల్లు కొనే స్తోమత లేని పరిస్థితి ఎదురైనప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసుకోవాలి. అయితే ఈ ఓపెన్ ప్లాట్ తక్కువ ధర అది అయితే బెటర్. ఎందుకంటే ఎక్కడి ఫ్లాటు అయినా తక్కువ నుంచి ఎక్కువ ధరకు పెరుగుతుంది. మరి ఎక్కువ ధర ఉన్న ప్లాట్ ను కొనుగోలు చేస్తే అంతకుమించి పెరిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఈఎంఐ ద్వారా ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తే ఉద్యోగం వచ్చిన వెంటనే చేయాలి. ఎందుకంటే మధ్య వయసు వచ్చేసరికి ఈఎంఐ భారం తగ్గిపోతుంది. అప్పటివరకు సొంత ఇల్లు మిగులుతుంది.
చిన్న వయసులోనే ఏదైనా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. రిటైర్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసేవారు ఉద్యోగం వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే భవిష్యత్తులో అధిక రేట్లు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మరొకరిపై ఆధారపడి అవకాశం ఉండదు అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే ఆదాయంలో సగం వరకు జల్సాలకు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల వయసు పెరిగిపోయి ఆ తర్వాత ఇల్లు కొనుగోలు చేయాలని అనుకున్న.. లేదా ఇతర పెట్టుబడులు పెట్టాలని అనుకున్నా ఆసక్తి ఉండదు. ఒకవేళ 30ఏళ్ల తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కనీసం 20 ఏళ్లు అంటే 60 ఏళ్ళు వచ్చేసరికి కూడా సొంత ఇల్లు ఉండే అవకాశం ఉండదు. అందువల్ల సాధ్యమైనంత వరకు 25 ఏళ్ల లోపు ఉద్యోగం పొందినట్లయితే వెంటనే ఇల్లు కొనుగోలు చేయడం మంచిది అని చెబుతున్నారు.
Also Raed : వినియోగదారులకు అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి ఇవి పనిచేయవు..