Kadiyam Nursery Farmers : మొక్కలు అనేక రకాలుగా, వృక్షాలు అనేక విధాలుగా ఉపయోగపడుతుంటాయి కాబట్టి.. వీటిని పర్యావరణ హితకారులు అని పిలుస్తుంటారు. అయితే విత్తనాల నుంచి మొక్కలు.. మొక్కల నుంచి వృక్షాలను అభివృద్ధి చేయడం ఇప్పటివరకు మనం చూసాం. ఇందుకు భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ప్రయోగాలు చేస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టుగా వారు ఏకంగా చెట్లను మొక్కలుగా మార్చేస్తున్నారు. అంతేకాదు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. అయితే ఇది కాకతాళియంగా.. అరుదైన సందర్భాల్లో జరిగింది కాదు. ఈ ప్రక్రియను కడియం నర్సరీలో రైతులు మొత్తం అమల్లో పెడుతున్నారు. ఆచరిస్తున్నారు.. దీని వెనుక బలమైన కారణం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ప్రకృతి రమణీయత తమ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనుకాాడటం లేదు. ఎందుకంటే మనుషుల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్నా కొద్దీ ఏదైనా సరే క్షణాల్లో తమ ముందు ఉండాలని భావిస్తున్నారు.. అప్పటికప్పుడు అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నారు.. గతంలో ఒక ఉద్యానవనాన్ని సృష్టించాలంటే.. లేదా దానిని రూపొందించాలంటే చాలా సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు మనం కోరుకున్నచోట ఉద్యానవనం ఏర్పడాలంటే.. వారం సరిపోతుంది. మనం కోరుకున్న వృక్షాలను మొక్కలుగా మార్చి అక్కడ నాటుతారు. ఎరువులు కూడా భారీ ఇస్తారు.. ఇందుకోసం కడియం రైతులు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవి సత్ఫలితాలను ఇవ్వడంతో వృక్షాలను మొక్కలుగా మార్చి నాటుతున్నారు. స్థలం చూపిస్తే చాలు.. అందులో రకరకాల వృక్షాలను మొక్కలుగా మార్చి.. నాటి ఉద్యానవనలుగా మార్చుతున్నారు. ఇలా వృక్షాలను మొక్కలుగా మార్చడం వల్ల పురాతన చెట్లు కొత్తగా జీవం పోసుకుంటున్నాయి. వాటి జీవిత కాలాన్ని మరింత పెంచుకుంటున్నాయి.
Also Read : సగం ఆడ, సగం మగ.. కొలంబియాలో వింత పక్షి.. అర్ధనారీశ్వరుడిని గుర్తుచేస్తోంది!
పునర్జన్మ ఇలా ఇస్తున్నారు..
వాస్తవానికి కొంతకాలంగా నగరాలు మాత్రమే కాదు చివరికి పల్లెలు కూడా కాంక్రీట్ అడవుల్లాగా మారుతున్నాయి. రోడ్లు కూడా విస్తరణకు గురవుతున్నాయి. రోడ్ల విస్తరణ లో భాగంగా చాలా వరకు పురాతన చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. అయితే అలాంటి వృక్షాలకు పునర్జన్మ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి చోటకు కడియం నర్సరీ రైతులు వెళ్లి.. అధునాతన హైడ్రాలిక్ యంత్రాలతో ఆ చెట్లను అక్కడి నుంచి తొలగించి.. మళ్లీ మొక్కలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి భారీ వృక్షాలకు వేళ్ళు అధికంగా ఉంటాయి. అవి చాలా దూరం విస్తరిస్తాయి. అటువంటి వాటిని గుర్తించి మొక్కలుగా మార్చి.. వాటికి జీవం పోయడం మామూలు విషయం కాదు. దీనిని అద్భుతమైన చెప్పవచ్చు.
లక్షల్లోనే ఉంటుంది
అయితే ఇలా వృక్షాలను మొక్కలుగా మార్చి.. కడియం రైతులు తక్కువతో విక్రయిస్తారంటే పొరపాటు. ఎందుకంటే వీటి ధర లక్షలలోనే ఉంటుంది.. ఎందుకంటే వృక్షాలను మొక్కలుగా మార్చడం సులభమైన ప్రక్రియ కాదు. దీనికోసం కడియం రైతులు భారీగా ఖర్చు చేస్తారు. భారీ వృక్షాలను అతి భారీ యంత్రాలతో తొలగిస్తారు. వాటిని ప్రత్యేకమైన వాహనంలో తరలిస్తారు. అయితే అంత పెద్ద వృక్షాలు తిరిగి చిగురించాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటివరకు ఆ వృక్షాలను ఆ రైతులు పోషిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వృక్షాలు చిగురించవు. అవి అలానే ఎండిపోతాయి. ఇప్పుడు రైతులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఇక ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన ఓ శ్రీమంతుడు రావి చెట్టును 12 లక్షలకు కొనుగోలు చేశాడు. వాస్తవానికి అది పురాతన వృక్షం. రోడ్డు విస్తరణలో భాగంగా కడియం రైతులు అక్కడికి వెళ్లి ఆ చెట్టును ఇక్కడికి తీసుకొచ్చారు. ఇన్ని రోజులపాటు దానిని పోషించారు. అందువల్లే ఆ చెట్టుకు అంత రేటు పడింది. పురాతన వృక్షాలకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలోని దేవాలయాల్లో నాటుతున్నారు. అందువల్ల వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది.