Rain in Drought-Hit Regions: వరునుడి కరుణ వల్ల విస్తరంగా వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఫలితంగా ఇన్నాళ్లపాటు ఎండిపోయిన నది ఒక్కసారిగా వరద నీటితో నిండిపోయింది. నెర్రెలు పాసిన నేలను నీటితో నింపింది. పంట పొలాలకు జీవధార కల్పించింది. ఫలితంగా అన్నదాతల మోమూల్లో హర్షం వెల్లి విరిసింది. అనేక ఆటంకాలను దాటుకుంటూ నీరు తమ వద్దకు చేరడంతో రైతులకు కనుల వెంట అదేపనిగా నీరు వచ్చింది.
సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యం కూడా అదే విధంగా ఉంది. ఆ వీడియోలో మారుమూల అటవీ ప్రాంతం కనిపిస్తోంది. బహుశా అది నది ప్రవహించిన ప్రాంతం అనుకుంటా. ఇన్ని రోజులపాటు అది ఎండిపోయి కనిపించింది. ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చింది. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా వరద నీరు వచ్చింది. ఆ వరద నీరు రాకను చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కళ్ళనిండా నీటిని చూసి తమ కళ్ళల్లో నీటిని నింపుకున్నారు.. ఇది కదా మాకు కావాల్సింది అనుకుంటూ ఆనంద తాండవం చేశారు. వరుణుడికి చేతులెత్తి దండం పెట్టారు. గంగమ్మ తల్లికి సాష్టాంగ ప్రమాణం చేశారు.
Also Read: Drought In Telangana: కమ్మేస్తోన్న కరువు.. ఎండుతున్న పంటలు
బహుశా ఈ సంఘటన తమిళనాడు లేదా కర్ణాటకలో చోటుచేసుకుని ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నది కావేరి అని.. ఇటీవల కాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని.. అందువల్లే వరద నీరు వచ్చి కావేరినది ఈ విధంగా ప్రవహిస్తోందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయాన్ని ట్విట్టర్ గ్రూక్ కూడా వెల్లడించలేకపోయింది. బహుశా ఇది జరిగి ఉంటుందని.. ఇండియాలోని మారుమూల ప్రాంతాలలో చోటుచేసుకుని ఉంటుందని.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలు సర్వ సాధారణమని వెల్లడించింది.. ఇలా నదులు నిండుగా ప్రవహిస్తేనే రైతులు మెండుగా పంటలు పండిస్తారని.. గ్రూక్ వెల్లడించింది. కాకపోతే ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఎందుకంటే నిండుగా నీటిని చూసిన తర్వాత రైతులకు ఎంత ఆనందం కలుగుతుందో ఈ వీడియో వెల్లడిస్తోంది. కావేరి నది పరివాహక ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది. తమిళనాడు ప్రాంతంలో అయితే అరటి, వరి, పత్తి, కొబ్బరి ఎక్కువగా పండుతుంది. కర్ణాటకలో అయితే అక్కడ రైతులు ఎక్కువగా రాగులు సాగు చేస్తుంటారు. వరి కూడా విస్తారంగానే వేస్తుంటారు. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే రైతులు అరటితో పాటు మిరప, వేరుశనగ, కాయగూరల వంటి పంటలు సాగు చేస్తారు. ఔత్సాహిక రైతులు గ్రీన్ హౌస్ లలో పూల సాగును కూడా చేపడుతుంటారు. కావేరి నీళ్లు సాగు మాత్రమే కాకుండా తాగు నీటి అవసరాలు కూడా తీర్చుతాయి.
గొంతెండిన వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ.
సీజన్ లో నది తొలి ప్రవాహానికి ప్రణమిల్లుతున్న
ప్రజలు pic.twitter.com/egslnoJHzz— Dr. K. Srinivasa Varma (@DrKSVarma) June 20, 2025