Nagarjuna Dhanush Box Office: ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోలు గా నటించిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయాయి. ఓవర్సీస్ లో అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో ఓవర్సీస్ కలెక్షన్స్ కేవలం ట్రైలర్ ని బట్టి వస్తున్నాయి. ట్రైలర్ బాగుంటే అక్కడ చిన్న హీరోలకు కూడా మినిమం రేంజ్ గ్యారంటీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటిది శేఖర్ కమ్ముల లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకుడు అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక లాంటి స్టార్ క్యాస్టింగ్ తో వచ్చి, విడుదలకు ముందు అద్భుతమైన ట్రైలర్ వదిలితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది?, ఈ సినిమాకు కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం వీకెండ్ తోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేవలం నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి 5 లక్షల డాలర్లు వచ్చాయి. వీకెండ్ కి 2 మిలియన్ డాలర్ మార్కుని అవలీలగా అందుకుంటుంది ఈ చిత్రం. ఇకపోతే ఈ సినిమాకు నేడు బుక్ మై షో యాప్ లో గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా విడుదలైతే ఎలాంటి ట్రెండ్ ఉంటుందో, అలాంటి ట్రెండ్ బుక్ మై షో యాప్ లో కనిపిస్తుంది. తెలుగు కలెక్షన్స్ తో పాటు తమిళ కలెక్షన్స్ కూడా తోడు అవ్వడం వల్లే ఈ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు తమిళం లో కానీ, ఇటు తెలుగు లో కానీ సరైన సూపర్ హిట్ సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోయాయి ఇన్ని రోజులు. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఇస్తున్న బూస్ట్ సాధారణమైనది కాదు.
ట్రేడ్ పండితుల అంచనాలు ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అటు నాగార్జున కెరీర్ లో , ఇటు ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు అని చెప్పొచ్చు. టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి కేవలం వీకెండ్ కి వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ధనుష్ కెరీర్ లో వంద కోట్ల గ్రాస్ సినిమాలు చాలానే ఉన్నాయి కానీ, నాగార్జున కెరీర్ లో లేవు. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి చిత్రాలు వంద కోట్ల మార్కుకి దగ్గరగా వచ్చి ఆగాయి. ‘కుబేర’ చిత్రం ఆయనకు మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రం తర్వాత ఆగష్టు నెలలో నాగార్జున విలన్ క్యారక్టర్ చేసిన ‘కూలీ’ విడుదల కాబోతుంది. ఈ సినిమా ఆయన కెరీర్ కి గేమ్ చేంజర్ కానుంది.