Tirumala Prasadam Ghee Issue: తిరుమలలో( Tirumala) లడ్డు వివాదం ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్తంగా ఏర్పాటైన ఈ బృందం విచారణను ప్రారంభించింది. అయితే ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ కు చెందిన బోలె బాబా డెయిరీ అక్రమాలు బయటపడ్డాయి. తిరుపతిలోని ఓ చిన్న డెయిరీ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క తిరుమలకే కాదు శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, ద్వారకా తిరుమల వంటి దేవాలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తాజాగా తేలింది. తిరుపతిలోని డైరీకి కమిషన్లు చెల్లించి.. ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యిని దేవాలయాలకు పంపినట్లు తేలిందని సమాచారం.
బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
కేవలం టీటీడీకి( TTD ) మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు అంతా భావించారు. కానీ ఇప్పుడు ఇతర దేవాలయాలకు సైతం సరఫరా జరిగినట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ హరి మోహన్ రానా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. హరి మోహన్ ఈ ఎపిసోడ్ లో సూత్రధారి అని.. బయటకు వస్తే సాక్షాధారాలు మాయం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా నే కేవలం తిరుమల కే కాదు.. అన్ని దేవాలయాలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగిందని తెలుస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Ponnovolu sudhakarreddy : పొన్నవోలు నయా లాజిక్.. నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా?
కొద్దిరోజులుగా విచారణ
తిరుమలలో వైసిపి( YSR Congress ) హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు బయటపెట్టారు. అటు తరువాత ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ ఇరుకున పడింది. దీంతో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ అధికారి నేతృత్వంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గత కొద్ది రోజులుగా ఈ బృందం తిరుమలను వేదికగా చేసుకుని దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఈ దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.