Men at Risk: నీకేంట్రా మగాడివి.. ఏదైనా చేయగలవు. ఏమైనా చేయగలవు.. మీసం తిప్పు.. తొడ కొట్టు.. దూసుకుపో.. నీకు తిరుగులేదు. నీకంటూ అడ్డులేదు. నిన్ను ఆపే దమ్ము ఎవరికీ లేదు” ఇలాంటి మాటలు ఇప్పుడు ఇక ఈ కాలంలో వినిపించవు. వినిపించే అవకాశం కూడా లేదు.
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతమైన ట్రెండ్ లో ఉంది. ఆ వీడియోలో ఒక యువతి మాట్లాడింది మహా అయితే నిమిషమే గాని.. ప్రస్తుత లోకంలో జరుగుతున్న పరిస్థితిని వెల్లడించింది. ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న దారుణాన్ని కళ్లకు కట్టింది. ఆమె సరదాగా చెప్పినప్పటికీ.. అదంతా జీవిత సత్యం.. మరీ ముఖ్యంగా మగవాళ్లు ఎదుర్కొంటున్న దారుణం.. బహుశా తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు చూసి.. మన దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆ యువతి అలాంటి వ్యాఖ్యలు చేసిందనుకుంటా. ఏది ఏమైనప్పటికీ ఆ యువతీ చేసిన వ్యాఖ్యలు మగాళ్ళను ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. ఆత్మ విమర్శ చేసుకునేలా చేస్తున్నాయి.
Also Read: Men’s Mental Health : పాపం పురుషులు చెప్పుకోలేక చచ్చిపోతున్నారే?
మగవాళ్ళపై అఘాయిత్యాలు పెరిగాయి
ఇటీవల కాలంలో మగవాళ్ళపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రేమ వివాహం చేసుకుంటే.. అమ్మాయి తరఫున బంధువులు వచ్చి అంతం చేస్తున్నారు. పోనీ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే.. అమ్మాయిలు తమ ప్రియుళ్లతో కలిసి అంతం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఒంటరిగా ఉండిపోదామనుకుంటే.. ఇంటి పక్కన వారు, ఇంటి ముందు వారు.. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు.. పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నావ్.. ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఎన్ని రోజులు ఉంటావ్.. అంటూ విమర్శిస్తున్నారు. వీటన్నింటికంటే సన్యాసం బెటర్. గుహలో ఉండడం బెటర్ అనే లాగా పరిస్థితులను తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో మగవాళ్ళపై దారుణాలు పెరిగిపోవడంతో ఓ యువతి స్వీయ వీడియో రూపొందించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు మగవాళ్ళు పడుతున్న బాధలను అందులో ఏ కరువు పెట్టింది. తద్వారా మగవాళ్ళ బతుకు వేస్ట్ అయిపోయిందని తీర్మానించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Insomnia : పురుషులకంటే మహిళల్లోనే నిద్రలేమి సమస్యలు.. వీటికి పరిష్కారాలు ఏంటంటే?
ఆ యువతి చెప్పింది నిజమే
” ఆ యువతి చెప్పింది నిజమే. ప్రతి సందర్భంలోనూ ఆమె ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలను కళ్ళకు కట్టింది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ తరహాలో ఎవరూ చెప్పలేదు. బహుశా ఆమె తన ఇంటి చుట్టూ ఎవరికైనా మగాళ్లకు దారుణం ఎదురవుతుంటే చూసింది కావచ్చు. అందువల్లే ఆమె నోటి నుంచి వాస్తవాలు మాత్రమే బయటికి వచ్చాయి. ఆమె చెబుతున్నప్పుడు కాస్త వినోదంగా అనిపించినప్పటికీ.. దాని వెనుక అంతులేని విషాదం ఉందని” నెటిజన్లు అంటున్నారు.. మరోవైపు గతంలో పురుషులు మహిళలను ఇలాగే ఇబ్బంది పెట్టే వారిని.. వారిపై భౌతికంగా దాడులు చేసే వాళ్ళని.. కొన్ని సందర్భాలలో వారిని అంత కూడా చేసేవారని.. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. మహిళల చేతికి అధికారం వచ్చిందని.. వారు పురుషులను కీలుబొమ్మలు లాగా మార్చుకున్నారని.. అవసరమైతే అంతం చేయడానికి కూడా వెనుకాడటం లేదని.. దీనిని మార్పుకు సంకేతంగా భావించాలని” కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.