Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) కష్టాలు అని బుక్ రాసి సినిమా తియ్యొచ్చు ఏమో. అన్ని కష్టాలు ఈ సినిమా మేకింగ్ వెనుక దాగి ఉన్నాయి. AM రత్నం(AM Ratnam) కాకుండా వేరే నిర్మాత అయ్యుంటే ఈ సినిమాని ఎప్పుడో వదిలి వేరే పని చూసుకునే వారు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఓర్పుగా భరించి షూటింగ్ ని పూర్తి చేసి జనాల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కేవలం కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫైనల్ VFX వర్క్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. రీసెంట్ గానే ఆ చిత్ర డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇరాన్(Iran) లో ఉన్నటువంటి VFX కంపెనీ కి వెళ్లి వర్క్ మొత్తం పరిశీలించి డబ్బులు కట్టి తిరిగొచ్చాడు. 90 శాతం VFX షాట్స్ డెలివరీ చేశారు కానీ, కొన్ని షాట్స్ ని మాత్రం ఇంకా అప్గ్రేడ్ చేయాలని ఆదేశించాడు.
Read Also: శక్తి మాన్ గా అల్లు అర్జున్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
వాళ్ళ నుండి ఈ ఫైనల్ డెలివరీ ఈ నెల 22న కానీ, 23న కానీ డెలివరీ చేస్తామని చెప్పారట. ఇంతలోపు ఇరాన్ ప్రాంతం వార్ జోన్ లోకి వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇజ్రాయెల్(Israel) దేశం రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలకు ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాన్ దేశం పై నేడు మిస్సైల్స్ దాడి జరిపింది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో ‘హరి హర వీరమల్లు’ మూవీ కోసం పని చేస్తున్న VFX కంపెనీ ఉన్న ప్రాంతం కూడా ఉంది. దీంతో ‘హరి హర వీరమల్లు’ పెండింగ్ వర్క్ బ్యాలన్స్ పడే అవకాశం ఉందని, మళ్ళీ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అభిమానుల ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. ఈ వారం లేదా వచ్చే వారం థియేట్రికల్ ట్రైలర్ వస్తుందని, వచ్చే నెలలో సినిమా విడుదల అవుతుందనే ఆశలో ఫ్యాన్స్ ఉన్నారు.
Read Also: సందీప్ వంగ మీద కోపంతోనే అల్లు అర్జున్ తన సినిమాలో దీపిక పదుకొనే ను తీసుకున్నాడా..?
కానీ ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన తర్వాత అసలు ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలే లేవేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ టీం ని మీడియా కి చెందిన కొంతమంది సంప్రదించగా, దాడులు జరిగింది కేవలం మిలిటరీ క్యాంప్స్ మీద మాత్రమే అని, ప్రజల మీద కాదని, VFX స్టూడియో కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అయినప్పటికీ కంటెంట్ బ్యాకప్ మొత్తం దుబాయ్ లో ఉందని, వీలైనంత తొందరగా దానిని పంపుతారని తెలుస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. అభిమానులు మాత్రం రెండు మూడు రోజుల్లో అప్డేట్ చెప్తామని చెప్పిన మూవీ టీం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండడం పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వచ్చే వారం అయినా అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.