MIM MLA Jaffar Hussain: హైదరాబాద్ లో వర్షాకాలం మొదలవడంతో నాలాల సమస్య తీవ్రరూపం దాల్చింది. నాంపల్లి ప్రాంతంలో నాలా సమస్య పరిష్కరించడంతో జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన స్థానికులు, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ను నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు అనేకసార్లు విజ్ణప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు
నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు
హైదరాబాద్ – యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని… pic.twitter.com/3uxH9FtaKd
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2025