Homeవింతలు-విశేషాలుKarakoram Highway: ప్రపంచంలో ఖచ్చితంగా వెళ్లాల్సిన రైడ్ ఇదీ.. పాక్ -చైనా పర్వతాల ‘పాము’ రోడ్డు...

Karakoram Highway: ప్రపంచంలో ఖచ్చితంగా వెళ్లాల్సిన రైడ్ ఇదీ.. పాక్ -చైనా పర్వతాల ‘పాము’ రోడ్డు స్టోరీ ఇదీ

Karakoram Highway: ఎటు చూసినా పర్వతాలు. దానికి తోడు దుర్భేద్యమైన నేలలు.. అటువంటి ప్రాంతంలో నడవడమే మహా ఇబ్బంది. అటువంటి చోట ఏకంగా రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డు అంతర్జాతీయ రహదారిగా ప్రాచుర్యం పొందింది. ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ దారి రెండు ప్రాంతాలను కాదు ఏకంగా రెండు దేశాలను కలుపుతోంది. ఈ దారి స్ట్రైట్ గా ఉండదు. ఇది మొత్తం నాగుపాము లాగా మెలి తిరుగుతూ ఉంటుంది. ఈ దారి మీద ప్రయాణించడం ఒకరకంగా సాహసం అనే చెప్పాలి.

ఆసియా ఖండంలో చైనా – పాకిస్తాన్ దేశాలను కరాకోరం హైవే కలుపుతుంది. దీనిని అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారి అని పిలుస్తుంటారు. దీన్నే మైత్రి మార్గం మని కూడా అంటారు. ఇది దాదాపు 1300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.. హిందూ కుష్, కరాకోరం, హిమాలయ పర్వతాల మధ్య ఈ రహదారి విస్తరించింది. ఈ రహదారిని 13 సంవత్సరాల పాటు నిర్మించారు. 1966 లో మొదలై 1979లో ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణంలో చైనా, పాకిస్తాన్ దేశాలకు చెందిన అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సిల్క్ రోడ్ లో ఈ అంతర్జాతీయ రహదారి ఒక భాగం. ఈ రహదారి నిర్మాణం అంత ఈజీగా సాగలేదు. నదుల మీదుగా.. మంచుతో కప్పబడిన పర్వతాల మీదుగా.. లోయల మీదుగా దీనిని నిర్మించారు. ఈ రోడ్డుమీదుగా ప్రయాణం సాగిస్తుంటే అద్భుతమైన అనుభూతి సొంతం చేసుకోవచ్చు.

Also Read: కష్టానికి ప్రతిఫలం.. ఇలాంటి వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తాయి.. కదిలిస్తాయి..

ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటే కుంజే రాబ్ ఉస్సు దర్శనమిస్తుంది. ఇది ప్రయాణికులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాసింగ్ ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తుంటే కనిపిస్తుంది. హున్జా లోయ, అట్టా బాద్ సరస్సు వంటివి పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తుంటే సాహస యాత్ర చేసినట్టు ఉంటుందని ప్రయాణికులు అంటూ ఉంటారు. అయితే ఈ రోడ్డు నిర్మాణంలో ఎన్నో విపత్తులు ఎదురైనప్పటికీ.. విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకృతికి స్వల్పంగా నష్టం చేకూర్చుకుంటూ ఈ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా ప్రకృతి చరిత్ర.. సంస్కృతి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. చైనా, పాకిస్తాన్ సంస్కృతులను దగ్గరుండి చూసే అవకాశం కల్పిస్తుంది.

Also Read: బెంగాల్ లో పులుల సంత.. వీడియో వైరల్!

ఈ రోడ్డు మీదుగా ఎక్కువగా సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. అయితే చైనా నుంచి వివిధ వస్తువులను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఈ రోడ్డు ద్వారానే చైనా నుంచి సరుకులు పాకిస్తాన్ దేశానికి వస్తుంటాయి. ఇక ఈ రోడ్డు నిర్మాణంలో ఎక్కువ ఖర్చును చైనా భరించింది. ఇక కార్మికుల విషయానికొస్తే పాకిస్తాన్ వారే ఎక్కువగా ఈ రోడ్డు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అంటే పెట్టుబడి పెట్టింది చైనా.. తలవంచుకొని పనిచేసింది పాకిస్తాన్.. అయితే ఈ రోడ్డు ద్వారా పాకిస్తాన్ కంటే చైనాకే ఎక్కువ ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు మీదుగా చైనా అనేక వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular