West Bengal Tigers: సాధారణంగా సంతల్లో( weekly markets ) పశువుల విక్రయాలు చూస్తుంటాం. కోళ్ల విక్రయాలు చూస్తుంటాం. కానీ ఆ సంతలో ఏకంగా పులులనే విక్రయిస్తున్నారు. వరుస పెట్టి పులులను ఉంచి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు కొందరు రైతులు. పశ్చిమ బెంగాల్లో ఓ సంతలో కేవలం పులుల విక్రయమే ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. బెంగాల్ టైగర్, ఇతర జాతులకు చెందిన పులులను అక్కడ విక్రయిస్తున్నారు. అయితే పులులను విక్రయించడం ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది ఈ వీడియో.
Also Read: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ లో అది ఒకే…కానీ ఆ ఒక్కటి మైనస్..గమనించారా..?
* పశ్చిమ బెంగాల్లో
పులులకు పెట్టింది పేరు పశ్చిమ బెంగాల్( West Bengal). అయితే దేశవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న గణాంకాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో మాత్రమే అనుకున్న స్థాయిలో పులులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో సంతల్లో సైతం పులులను విక్రయిస్తున్నారంటూ కొందరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణ వారపు సంతల్లో పశువులను విక్రయిస్తున్న మాదిరిగానే అక్కడ పులులను పక్కనే పెట్టుకుని రైతులు కొనుగోలుదారుల కోసం వేచి ఉండడం కనిపించింది. అయితే ఇది ఆసక్తికర వార్త కావడంతో ఎక్కువమంది.. అలానే తిలకిస్తున్నారు. వింతగా ఉండడంతో షేర్ చేస్తున్నారు.
* బోగస్ వీడియో..
అయితే సోషల్ మీడియాలో( social media) వ్యూస్ కోసం ఇది సృష్టించిన వీడియో గా తెలుస్తోంది. ఈ వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఎన్నో అసమానతలు గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించినదిగా అర్థమవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఒరిజినల్.. బోగస్ అన్నది ఇట్టే తెలిసిపోతోంది. ఈ వీడియో కూడా బోగస్ అని తేల్చేయడంతో వైరల్ క్రమేపి తగ్గింది. షేర్ చేసేందుకు కూడా ఎవరు ఇష్టపడడం లేదు. మరికొందరైతే ఇలాంటి తప్పుడు వీడియోలు పెట్టి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.