Homeవింతలు-విశేషాలుKalpit Veerwal JEE Topper: JEE లో టాపర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Kalpit Veerwal JEE Topper: JEE లో టాపర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Kalpit Veerwal JEE Topper: JEE మనదేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఈ ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించాలంటే అంత సులభం కాదు. ప్రతి ఏడాది లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. అందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఇన్ని ప్రతి బంధకాలు దాటుకొని పరీక్ష రాసి.. సీటు సంపాదించడం అంత సులభం కాదు. కానీ దానిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కల్పిత్ వీర్వాల్ సులభంగా చేసేశాడు. 2017లో ఆల్ ఇండియా స్థాయిలో […]

Kalpit Veerwal JEE Topper: JEE మనదేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఈ ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించాలంటే అంత సులభం కాదు. ప్రతి ఏడాది లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. అందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఇన్ని ప్రతి బంధకాలు దాటుకొని పరీక్ష రాసి.. సీటు సంపాదించడం అంత సులభం కాదు. కానీ దానిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కల్పిత్ వీర్వాల్ సులభంగా చేసేశాడు. 2017లో ఆల్ ఇండియా స్థాయిలో 360 కి 360 మార్కులు సాధించి నేషనల్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.

ఆ స్థాయిలో ర్యాంకు సాధించిన తర్వాత.. కల్పిత్ కు ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ భాగంలో సీటు లభించింది. అందులో చేరిన అతడు మెరిట్ మార్కులతో ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అతడు సాధించిన మార్కులకు కచ్చితంగా కార్పొరేట్ కంపెనీలో పెద్ద స్థాయి కొలువు వచ్చేది. కానీ ఆ జాబ్ చేస్తే రొటీన్ జీవితమవుతుందని అతడు భావించాడు. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత.. కార్పొరేట్ ఉద్యోగం వైపు అతడు వెళ్లలేదు. తనకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ మీద దృష్టి పెట్టాడు. మ్యూజిక్ విభాగంలో పాటలు రాయడం ప్రారంభించాడు. అంతేకాదు పాటలను పాడటాన్ని ప్రాక్టీస్ చేశాడు. అతని గొంతు కూడా బాగుండడంతో అందులో రాణిస్తున్నాడు.. ఇష్టమైన చదువును పూర్తి చేసిన తర్వాత.. నచ్చిన సంగీతంలో తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. అతడు రాసే పాటలు.. పాడే విధానం బాగుండడంతో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

నేటి కాలంలో పిల్లల మీద తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను బలవంతం గా రుద్దుతున్నారు. ఐఐటి లో సీట్ రావాలని లక్ష్యాలు విధిస్తున్నారు. కానీ కల్పిత్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాడు. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమేనని.. నచ్చని ఉద్యోగం చేసి జీవితం మీద ఒత్తిడి పెంచుకోవడం కాదని నిరూపిస్తున్నాడు.. మన తెలుగు రాష్ట్రాలలో చాలామంది విద్యార్థులు ఐఐటి పేరుతో తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఒకవేళ ఐఐటీలలో సీట్లు సాధించినప్పటికీ అక్కడి విద్యావిధానాన్ని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి విద్యార్థులకు కల్పిత జీవితం ఆదర్శనీయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper