Homeలైఫ్ స్టైల్Inspirational Couple Marriage Story: ప్రేమకు రూపు అడ్డం కాదు.. లోకంతో పని లేదు.. ఓ...

Inspirational Couple Marriage Story: ప్రేమకు రూపు అడ్డం కాదు.. లోకంతో పని లేదు.. ఓ జంట ఆదర్శ వివాహం

Inspirational Couple Marriage Story: ఆ యువతి చూడ చక్కగా ఉంటుంది. కుందనపు బొమ్మల కనిపిస్తుంది. ఆమె కోసం చాలామంది పరితపిస్తుంటారు. కానీ ఆమె మాత్రం ఒక మరుగుజ్జు యువకుడిని ప్రేమించింది. వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మరుగుజ్జు వాడిని పెళ్లి చేసుకుని ఏం బాగుపడతావ్.. ఆ పెళ్లి వద్దు అని వారించారు తల్లిదండ్రులు. కానీ వారిని సైతం ఎదిరించి మరి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. నిజంగా ఆమె చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ అభినందించారు. […]

Inspirational Couple Marriage Story: ఆ యువతి చూడ చక్కగా ఉంటుంది. కుందనపు బొమ్మల కనిపిస్తుంది. ఆమె కోసం చాలామంది పరితపిస్తుంటారు. కానీ ఆమె మాత్రం ఒక మరుగుజ్జు యువకుడిని ప్రేమించింది. వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మరుగుజ్జు వాడిని పెళ్లి చేసుకుని ఏం బాగుపడతావ్.. ఆ పెళ్లి వద్దు అని వారించారు తల్లిదండ్రులు. కానీ వారిని సైతం ఎదిరించి మరి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. నిజంగా ఆమె చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ అభినందించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వెలుగు చూసింది ఈ ఘటన.

* చిన్ననాటి నుంచి ప్రేమ..
ప్రేమకు రూపు రేఖలు అడ్డుకావని నిరూపించింది మచిలీపట్నానికి చెందిన గౌసియా. తన చిన్ననాటి స్నేహితుడైన వేముల శశిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ప్రాథమిక స్థాయి నుంచి ఒకే తరగతిలో చదువుకునే వారు. 9వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నారు. శశి జిల్లా కోర్టులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుండగా.. గౌసియా ఫార్మసిస్ట్ గా స్థిరపడింది. ప్రాథమిక స్థాయిలో ఏర్పడిన వీరి స్నేహం క్రమేపి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి వివాహానికి గౌసియా కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. శశి మరుగుజ్జు కావడంతో ఈ పెళ్లికి అంగీకరించమని తేల్చి చెప్పారు.

* కుటుంబ సభ్యులను ఎదిరించి..
అయితే ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను వదులుకోలేనని.. శశితో జీవితాంతం అడుగులు వేస్తానని తీర్మానించుకున్నారు గౌసియా. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి చేసిన వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నవ దంపతులు ఇరుకుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమకు, పెళ్లికి మనిషి రూపురేఖలతో పనిలేదని తేల్చి చెప్పారు గౌసియా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper