Allu Arjun Raka Movie First Look: కోట్లాది మంది అభిమానులు , ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , అట్లీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఇన్ని రోజులు ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు కాబట్టి #AA22 అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రానికి ‘రాకా'(Raka Movie) అనే టైటిల్ ని ఖరారు చేశారు. విడుదలకు ముందు చాలా టైటిల్స్ వినిపించాయి. కొంతమంది ‘అయాన్’ టైటిల్ ని ఖరారు చేశారని ప్రచారం చేయగా , మరికొంతమంది మాత్రం ‘పుష్ప 2’ చిత్రం లోని పాపులర్ డైలాగ్ ‘వైల్డ్ ఫైర్’ టైటిల్ ని ఖరారు చేసినట్టు గా చెప్పుకొచ్చారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ ‘రాకా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
అల్లు అర్జున్ లుక్ కూడా చాలా విచిత్రం గా ఉంది. ‘ఐ’ చిత్రం లో విక్రమ్ ఒక పాటలో బీస్ట్ గెటప్ లో కనిపిస్తాడు గుర్తుందా?, అల్లు అర్జున్ లుక్ కూడా దాంతో పోలి ఉంది. అంతే కాకుండా కార్తీ హీరో గా నటించిన ‘కాష్ముర’ లో సెకండ్ గెటప్ కూడా ఇలాగే ఉంటుంది. ఆ రెండు గెటప్స్ ని మిక్స్ చేసి ఈ లుక్ ని తయారు చేసినట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో రెండవ పాత్ర విలన్. ఆ క్యారక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ నే నేడు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కి జోడీ గా రష్మిక మందాన నటించనుంది. ఆమెది కూడా విలన్ క్యారెక్టరే . తన ప్రతీ సినిమాతో అభిమానులను ప్రేక్షకులను సర్ప్రైజ్ కి గురి చేసే అల్లు అర్జున్ , ఈరోజు ఇలాంటి గెటప్ లో కనిపిస్తూ ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
The wait is over.
Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026