Homeవింతలు-విశేషాలుJapan film industry: అలాంటి చిత్రాల్లో నటించేందుకు 10,000 మంది నటీమణులకు 70 మంది నటులే.....

Japan film industry: అలాంటి చిత్రాల్లో నటించేందుకు 10,000 మంది నటీమణులకు 70 మంది నటులే.. ప్రమాదంలో 20 బిలియన్ డాలర్ల పరిశ్రమ..

Japan film industry: చిత్ర పరిశ్రమ అంటే.. కేవలం ఇంటిల్లిపాది చూసే చిత్రాలు మాత్రమే అని మాత్రమే మనకు తెలుసు. మనదేశంలో ఆ తరహా సినిమాలను కూడా గతంలో నిర్మించేవారు. కొంతమంది నటులు ఆ తరహా చిత్రాలలో నటించేవారు. ఇప్పుడంటే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.. స్మార్ట్ ఫోన్ లో సర్వం కనిపిస్తోంది కాబట్టి.. ఆ తరహా చిత్రాలకు అంతగా డిమాండ్ లేదు. కానీ ఒకప్పుడు ఆ తరహా చిత్రాలు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేవి.

కేరళ రాష్ట్రంలో 2000 నుంచి 2008 వరకు షకీలా చిత్రాలు అక్కడి చిత్ర పరిశ్రమను షేక్ చేసేవి. మోహన్ లాల్.. మమ్ముట్టి.. ఇంకా పెద్ద పెద్ద నటుల చిత్రాలు షకీలా సినిమాల తాకిడికి వాయిదా పడేవి. షకీలా, రేష్మ.. ఇంకా కొంతమంది నటీమణులు అప్పట్లో కేరళ రాష్ట్రంలో పెద్ద సెలబ్రిటీలుగా చలా మణి అయ్యేవారు.

మనదేశంలో ఆ తరహా చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ తగ్గింది. కానీ విదేశాలలో ఆ తరహా చిత్రాల పరిశ్రమ వర్ధిల్లుతూనే ఉంది. అమెరికా నుంచి మొదలుపెడితే జపాన్ వరకు పెద్దలు చూసే చిత్రాలను నిర్మించడం పరిపాటిగా ఉంది. హాలీవుడ్ ను మించి వయోజనుల చిత్రాల పరిశ్రమ ఉందంటే మామూలు విషయం కాదు. జపాన్ లో కూడా ఆ తరహా చిత్రాలను విపరీతంగా రూపొందిస్తూ ఉంటారు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ ఆ నటీమణులు.. నటులు ఉన్నారు.

గతంలో జపాన్లో ఆ తరహా చిత్రాలలో నటించేందుకు చాలా మంది ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో నటీమణుల సంఖ్య పెరిగింది. నటుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఓ నివేదిక ప్రకారం జపాన్ దేశంలో ఆ తరహా చిత్రాలను రూపొందించే పరిశ్రమలో 10,000 మంది వరకు నటీమణులు ఉంటే.. కేవలం 70 మంది మాత్రమే నటులు ఉన్నారట. దీంతో అక్కడి పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నదట. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆ తరహా చిత్రాల పరిశ్రమ.. నటులు లేక పెద్దపెద్ద ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటున్నదట. ఇతర ప్రాంతాల నుంచి నటులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. జపాన్ దేశస్తులు.. జపాన్ నటులను మాత్రమే ఇష్టపడతారట.

“గతంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. నటులు మాత్రమే లేరు. నతీమణులు ఈ ఫీల్ లోకి చాలామంది వస్తున్నారు. ఏకంగా 10,000 మంది దాకా ఉన్నారు. కానీ నటుల కొరత విపరీతంగా ఉంది. అందువల్ల కొత్త ప్రాజెక్టులు చేపట్ట లేకపోతున్నామని” దర్శకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version