Kuldhara: పై ఉపోద్ఘాతంలో చెప్పిన ఆ గ్రామం పేరు “కుల్దారా”. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మేర్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి సుదూరంలో ఉన్నప్పటికీ.. ఈ గ్రామం ఒకప్పుడు పచ్చగా ఉండేది. పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేది. గ్రామస్తులు వ్యవసాయం చేస్తూ ఉపాధిని పొందేవారు. ఈ ప్రాంతంలో గోధుమలు.. బార్లీ.. ధనియాలు.. జీలకర్ర.. ఆవాలు.. మెంతులు ఎక్కువగా పండేవి. ఈ ప్రాంతం నుంచి పై పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తద్వారా రైతులు కూడా భారీగా ఆదాయాన్ని సంపాదించేవారు. ఈ గ్రామంలో అమ్మాయిలు అందంగా ఉండేవారు. అదే ఈ గ్రామం పాలిట శాపంగా మారింది. ఫలితంగా ఈ గ్రామం వల్లకాడుగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు నిండుగా జనం.. మెండుగా పంటలు పండిన ఈ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. స్మశాన నిశ్శబ్దంతో ఒకరకంగా దయ్యాల దిబ్బగా మారింది.
Also Read: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
ఇది దాని వెనుక ఉన్న మిస్టరీ
కుల్దారా అనేది అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ దాదాపు 1600 మంది దాకా జీవించేవారు. గొప్ప ప్రాంతంగా పేరుపొందిన ఈ గ్రామం రాత్రికి రాత్రే ఖాళీ అయిపోయింది. 13వ శతాబ్దంలో సలీం సింగ్ అనే మంత్రి ఆధీనంలో ఈ గ్రామం ఉండేది. అయితే అతడు స్త్రీ లోలుడు. ఎవరినైనా సరే లోబర్చుకునేవాడు. వారి ఇష్టంతో ప్రమేయం లేకుండా పడక సుఖం పొందేవాడు. భర్తల ముందే వారి భార్యలను బలాత్కారం చేసేవాడు. అందువల్లే ఇతడిని అత్యంత క్రూరమైన మంత్రిగా పేర్కొనేవారు. అయితే కుల్దారా గ్రామ పెద్ద కూతురు అందంగా ఉండేది. ఆమె మీద సలీం సింగ్ మనసుపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డాడు. ఇదే ప్రతిపాదనను ఆ ఊరి పెద్ద ముందు ఉంచాడు. దానికి అతడు ఒప్పుకోలేదు. పెళ్లికి ఒప్పుకోకపోతే ఊరిని మొత్తం వల్ల కాడు చేస్తానని సలీం సింగ్ హెచ్చరించాడు. దానికి ఆ ఊరి పెద్ద ఒప్పుకోలేదు. చివరికి ఆ వివాహానికి తాము కూడా పూర్తి వ్యతిరేకమని గ్రామస్తులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు సలీం సింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఒకరోజు రాత్రి గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ గ్రామం ఖాళీగా ఉంది. ఒక రకంగా చూస్తే స్మశాన నిశ్శబ్దం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ దయ్యాలు ఎక్కువగా ఉంటాయని.. అందువల్లే నివసించడానికి ఎవరూ ప్రయత్నించరని అంటుంటారు. గతంలో ఈ ప్రాంతంలో నివసించడానికి చాలామంది వచ్చినప్పటికీ.. వారు కూడా రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు. కొందరు రకరకాల వ్యాధుల బారిన పడ్డారు. రాత్రిపూట ఈ ప్రాంతంలో దయ్యాలు సంచరిస్తాయని.. అందువల్లే ఎవరూ కూడా ఈ ప్రాంతం వైపుగా వెళ్లడానికి సాహాసం చేయరని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.. మరోవైపు ఈ ప్రాంతంలో విలువైన వనరులు ఉన్నప్పటికీ.. అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితుల వల్ల పంటలు సాగు చేయలేని దుస్థితి ఏర్పడింది. అందువల్లే ఈ ప్రాంతం రాజస్థాన్ రాష్ట్రంలో మిస్టీరియస్ ప్లేస్ గా పేరుపొందింది. అయితే దీని గురించి తెలుసుకోవడానికి కొంతమంది చరిత్రకారులు ప్రయత్నించినప్పటికీ.. ఆ తర్వాత ఎదురైన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వారు వెనుకంజ వేశారు.
Also Read: కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్