DC Vs RCB IPL 2025: విదేశీ ప్లేయర్లను మాత్రమే కాదు.. స్వదేశీ ప్లేయర్లతో కూడా అతడు నిత్యం పరాచకాలు ఆడతాడు. గెలుకుతాడు. ప్రతి సందర్భంలోనూ పరిహాసం ఆడతాడు. అందులో వినోదం పొందుతాడు. చివరికి తనదే పై చేయి అయ్యేలాగా చూస్తాడు. ఈ తరంలో ఈ ఆటగాడు.. ఆటగాడు అని తేడా లేదు.. అందరూ విరాట్ కోహ్లీ బాధితులే. కాకపోతే కోహ్లీ వ్యవహరించే తీరులో వినోదం ఉంటుంది. దానికి మించి ఉత్సాహం ఉంటుంది. తోటి ఆటగాళ్లతో సాగించే స్నేహం కనిపిస్తుంది. అందుకే విరాట్ కోహ్లీతో పరిహాసమంటే మిగతా ఆటగాళ్లు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఎలాగూ సోషల్ మీడియా ఉంది కాబట్టి.. విరాట్ కోహ్లీ వల్ల ఆటగాళ్లు మరింత ఫేమస్ అయిపోతారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వల్ల కేఎల్ రాహుల్, తాజాగా శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి గా మీడియాలో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో సంచలనమయ్యారు.
Also Read: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
కాంతారా స్టెప్ చూసి చూపించాడు
విరాట్ కోహ్లీని ఎవరైనా గెలికితే ఏమాత్రం ఊరుకోడు. పైగా దానికి అంతకుమించి అనే స్థాయిలో రివెంజ్ తీర్చుకుంటాడు తీర్చుకుంటాడు.. ఇటీవల బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ జట్లు పరస్పరం పోటీపడ్డాయి.. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. బెంగళూరు జట్టుపై సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అంత కాదు ఢిల్లీ జట్టును గెలిపించి.. ఈ గ్రౌండ్ నాది అన్నట్టుగా మైదానంలో బీస్ట్ మోడ్ ప్రదర్శించాడు. చివర్లో కాంతారా స్టెప్ వేసి అదరగొట్టాడు. అది ఒక రకంగా విరాట్ కోహ్లీకి ఇబ్బందిగా అనిపించింది. బెంగళూరు అభిమానుల ముందు చులకనగా అనిపించింది. దీనికి రివెంజ్ తీర్చుకోవాలని భావించిన విరాట్ కోహ్లీ.. దానికి సమయం కోసం ఎదురు చూశాడు. అది రానే వచ్చింది. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ సమయోచితమైన ఇన్నిచాడాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ ను గెలికి మరీ కయ్యం పెట్టుకున్నాడు. అంతేకాదు మ్యాచ్ గెలిపించి చూపించాడు. చివరికి కేఎల్ రాహుల్ ను గేలి చేశాడు. గెలిచిన తర్వాత.. కాంతారా స్టెప్ వేసి చూపించాడు. దీంతో కేఎల్ రాహుల్ ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాడు. విరాట్ కోహ్లీ మాత్రం ప్రతీకార ఆనందాన్ని పొందాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవుతోంది. బెంగళూరు అభిమానులు ఈ వీడియోను తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు. అందుకే విరాట్ కోహ్లీతో పోటీ పడొద్దు.. అతడిని గేలి చేయొద్దు. అన్నింటికీ మించి అతడిని అస్సలు గెలకొద్దు. కేవలం స్వదేశీ ఆటగాళ్లు మాత్రమే కాదు.. విదేశీ ప్లేయర్ల విషయంలోనూ విరాట్ కోహ్లీ ఇలానే వ్యవహరిస్తాడు. కాకపోతే వారిపై రివెంజ్ తీర్చుకునే విషయంలో విరాట్ కోహ్లీ మరింత కఠినంగా ఉంటాడు. ఏమాత్రం అవకాశం వచ్చినా వదిలిపెట్టడు..
Kohli mocking Kl Rahul about his celebration pic.twitter.com/7h4mPsJ65A
— Ayush. (@OneKohli) April 27, 2025