Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ లో ఇద్దరు పిల్లలు ఉన్న వారి కోసం కూడా ఒక ప్రత్యేక పథకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకాలు సామాన్యులకు వరంగా మారుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ పథకాలు లేదా మరియు దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఆసరాగా నిలుస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ లో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి అందించే పథకాలు ప్రజల కోసం అందుబాటులో ఉండడంతో చాలామంది ప్రజలు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తే తమ కుటుంబం కోసం ఆ ఉద్యోగంలో వచ్చిన జీవితంలో ఎంతో కొంత ఆదా చేస్తూ ఉంటారు. అలా ఆదా చేసిన డబ్బులు భవిష్యత్తులో తమ పిల్లలకు ఉపయోగపడతాయని రూపాయి రూపాయి కూడా పెట్టి భవిష్యత్తులో తమ పిల్లల చదువులకు మరియు పెళ్లి ఖర్చులకు వినియోగించాలని అనుకుంటారు.
Also Read:ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
ఇలా పొదుపు చేసిన డబ్బులను మంచి రాబడి ఇచ్చే పెట్టుబడి పథకాలలో పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు.అయితే బ్యాంకులలో కంటే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలలో ఎక్కువ రాబడి ఇచ్చే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకాలలో బాల్ జీవన్ బీమా యోజన పథకం కూడా ఒకటి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకంలో మీరు కేవలం ప్రతిరోజు ఆరు రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో మీరు కనీసం లక్ష రూపాయల వరకు రాబడి పొందగలుగుతారు. ఒకవేళ మీరు ఈ పథకంలో 18 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మూడు లక్షల రూపాయలు లభిస్తుంది.
ఈ పథకంలో పొదుపు చేస్తున్న వారి స్తోమతను బట్టి మీరు ప్రతిరోజు ఆరు రూపాయలు లేదా 18 రూపాయలు పెట్టుకోవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకంలో మీరు కేవలం మీ పిల్లల పేర్ల మీద మాత్రమే డబ్బును పోస్ట్ ఆఫీస్ ఖాతాలో పొదుపు చేయగలరు. మీ పిల్లల వయస్సు 5 నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి. ఈ పథకానికి తల్లిదండ్రుల వయస్సును కూడా పరిగణలో తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకానికి తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించి ఉండకూడదు. కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఈ పోస్ట్ ఆఫీస్ పథకం వర్తించదు. మీ కుటుంబంలో ఉన్న కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
Also Read: కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్