Homeవింతలు-విశేషాలుElephant Pregnancy: అమ్మ కడుపులోనే అన్నీ నేర్చుకుంది... 22 నెలలు తల్లి గర్భంలోనే.. అత్యంత ప్రత్యేకం...

Elephant Pregnancy: అమ్మ కడుపులోనే అన్నీ నేర్చుకుంది… 22 నెలలు తల్లి గర్భంలోనే.. అత్యంత ప్రత్యేకం ఆ జీవి..

Elephant Pregnancy: అమ్మతనం అనేది ప్రతీ జీవికి పునర్జన్మలాంటిదే. అందుకే ప్రతీ తల్లి తమ బిడ్డలను ప్రేమగా చూసుకుంటుంది. బిడ్డలు కూడా తల్లిని అంతే ప్రేమిస్తారు. అయితే భూమి మీద ఉన్న జీవులలో గర్భధారణ సమయం ఒక్కో జీవికి ఒక్కోలా ఉంటుంది. మహిళ కడుపులో శిశువు 9 నెలలు ఉంటే.. కుక్క, పిల్లి కడుపులో పిల్లలు తక్కువ నెలలు ఉంటాయి. అంటే అంత త్వరగా శిశువులు ఎదుగుతాయి. ఇక గుర్రం, ఏనుగు కడుపులో పిల్లలు ఎక్కువ కాలం ఉంటాయి. ఏనుగు తన పిల్లను దాదాపు 22 నెలలు కడుపులో పెట్టుకుంటుంది. అభిమన్యుడు అమ్మ కడుపులో యుద్ధ విద్యలు నేర్చుకున్నట్లు.. ఏనుగు పిల్ల కూడా 650 రోజులు తల్లి కడుపులో ఉండి చాలా విషయాలు నేర్చుకుంటుంది. ఏ క్షీరదాలతో పోలిస్తే ఏనుగులు సుదీర్ఘ గర్భధారణ వ్యవధిని కలిగి ఉంటాయి.. ఇది సుమారు 22 నెలలు అంటే 680 రోజులు ఉంటుంది. ఇది ఇంత పొడవుగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి, అయినప్పటికీ దాని దీర్ఘకాలిక గర్భధారణ కాలం కూడా చాలా సందర్భాల్లో దాని బిడ్డను ప్రత్యేకంగా చేస్తుంది. ఏనుగు సుదీర్ఘ గర్భధారణ వెనుక పెద్ద కారణమే ఉందట. ఏనుగు బిడ్డ మెదడు గర్భంలో పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగా, ఏనుగు పిల్లలు పుట్టినప్పుడే.. దాని మెదడు బాగా అభివృద్ధి చెందిన స్థితిలో ఉంటుంది. అంతుకే పుట్టిన వెంటనే తెలివిగా ఉంటాయట. వీటి ఆలోచన, అవగాహన ఇతర ఏనుగుల మాదిరిగానే ఉంటాయి.

గర్భంలో ఉన్నప్పుడే..
ఏనుగులు తమ సామాజిక నిర్మాణాన్ని తెలుసుకోవడమే కాకుండా పుట్టిన వెంటనే ఆహారం కోసం తమ తొండాన్ని ఉపయోగించడం నేర్చుకుంటాయి. గర్భంలో ఉన్నప్పుడు పిల్ల ఏనుగు ఏం చేయాలో, ఎలాంటి వాతావరణంలో పుడుతాయో కూడా తెలుసుకుంటుందట. పిల్ల ఏనుగు పరిపక్వంగా జన్మించినందున.. ఇది మందలోని సంక్లిష్టమైన సామాజిక శ్రేణులను గుర్తిస్తుంది.. నావిగేట్‌ చేసే సహజ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అధునాతన మెదడు అభివృద్ధి ఏనుగు దూడలను కుటుంబ సభ్యులను గుర్తించడానికి, సంబంధాలను అర్థం చేసుకోవడానికి.. సామాజిక సూచనలకు తగిన విధంగా స్పందించడానికి అనుమతిస్తుంది.

నిర్ధిష్ట హార్మోన్లు..
ఇక ఏనుగుల్లో నిర్ధిష్ట హార్మోన్లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలిక గర్భధారణకు కారణమవుతుంది. ఇది అండోత్సర్గము ప్రత్యేక చక్రాన్ని కలిగి ఉంటుంది. కార్పస్‌ లుటియా అని పిలువబడే అనేక అండాశయ శరీరాలు స్రవించే హార్మోన్ల ద్వారా గర్భధారణ నిర్వహణను కూడా కలిగి ఉంటుంది. ఈ హార్మోన్ల ప్రక్రియలు ఇతర క్షీరదా జాతులలో కనిపించవు, అవి ఏనుగుల ప్రత్యేక పునరుత్పత్తి జీవశాస్త్రాన్ని హైలైట్‌ చేస్తాయి.

కడుపులోనే నేర్చకుంటుంది..
సుదీర్ఘకాలం గర్భంలో ఉంటూనే ఏనుగు బిడ్డ ఎంతగా నేర్చుకుంటుందంటే ఏనుగు ఒంటరిగా వదిలేసినా అది బతకగలదు. ఇది ముప్పును కూడా ఎదుర్కోగలదు. ఇక ఏనుగు పుట్టిన వెంటనే.. ఇతర ఏనుగులు చేసే ప్రతి పనిని సాధారణ పద్ధతిలో చేయగలదు.

రెండేళ్లు గర్భంలోనే..
ఏనుగుల గర్భధారణ లేదా జనన సమయం సుమారు రెండు సంవత్సరాలు కాబట్టి.. ఏనుగుల పుట్టుకకు మధ్య సగటున 4 నుంచి 5 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. దీనితో, పిల్ల ఏనుగు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. తల్లి అతనికి సమానంగా సహాయపడుతుంది. ఏనుగులు మంచి జ్ఞాపకశక్తికి కూడా ప్రసిద్ది చెందాయి. అవి ఏదైనా ఎక్కువసేపు గుర్తుంచుకుంటాయి. ఏనుగులు సానుభూతి, దుఃఖం, పరోపకారం వంటి భావోద్వేగాలను బాగా చూపిస్తాయి. ఇది వారితో మరియు ఇతర కుటుంబ సభ్యులతో బలమైన బంధాలను ఏర్పరుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version