Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి పరిస్థితి ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో చూసారా..? ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల చిరంజీవి ఆ పార్టీ ని కాంగ్రెస్ లోకి విలీనం చెయ్యాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవి తో ఆయన విభేదించి వైసీపీ పార్టీ లో చేరాడు.

Written By: Vicky, Updated On : August 12, 2024 5:37 pm

Posani Krishna Murali

Follow us on

Posani Krishna Murali: ఎంతోమంది లెజెండ్స్ ఉన్న మన తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటిది ఒక నటుడిగా సక్సెస్ అవ్వడమే కాకుండా రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా , కమెడియన్ గా ఇలా ఇన్ని క్రాఫ్ట్స్ లో సక్సెస్ అయిన వారు ఇండస్ట్రీ లో నూటికో కోటికో ఒకరిద్దరు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు పోసాని కృష్ణ మురళి. ఒకానొక దశలో ఈయన లేని సినిమా అంటూ ఉండదు అనే తరహా క్రేజ్ ఉండేది. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడో, అప్పటి నుండి ఈయనకి శత్రువులు ఎక్కువైపోయారు.

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల చిరంజీవి ఆ పార్టీ ని కాంగ్రెస్ లోకి విలీనం చెయ్యాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవి తో ఆయన విభేదించి వైసీపీ పార్టీ లో చేరాడు. వైసీపీ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ కళ్ళు నెత్తిమీదకి వచ్చేసాయి. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని నోటికి ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ ని అయితే వినకూడని పదాలతో తిట్టి, అతని ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా నాశనం అయిపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టాడు. అప్పట్లో పోసాని చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో పోసాని కేవలం పోలీస్ సెక్యూరిటీ తోనే బయట తిరిగేవాడు. కానీ పవన్ కళ్యాణ్ తినకూడని మాటలు అన్న తర్వాత అతనికి సినిమా ఇండస్ట్రీ లో కూడా అవకాశాలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా పోసాని గత ఎన్నికల వరకు యాక్టీవ్ గానే ఉండేవాడు.

కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఈ ఎన్నికలలో అతి దారుణంగా ఓడిపోయిందో, అప్పటి నుండి పోసాని అడ్రస్ గల్లంతు అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాను వాడుతున్న మొబైల్ నంబర్స్ అన్నిటిని మార్చేశాడు. పలువురి నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న ఆయన, ఇప్పుడు వాళ్లకి కూడా అందుబాటులో లేని పరిస్థితి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోసాని కృష్ణ మురళి విదేశాలలో ఎవరికీ తెలియని చోట తన కుటుంబంతో తల దాచుకున్నాడని తెలుస్తుంది. ఈ ఐదేళ్లు ఆయన సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ యాక్టీవ్ గా ఉండే సమస్యే లేదట. అధికార మదంతో ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చెయ్యడం ఎందుకు, ఇప్పుడు దొంగ లాగ ఇలా దాక్కోవడం ఎందుకు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పోసాని కృష్ణ మురళి చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ’14’. ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. మళ్ళీ ఆయన ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తాడో చూడాలి.