https://oktelugu.com/

First Landmass On Earth: మొట్టమొదటి భూభాగాన్ని కలిగిన దేశం ఏదో తెలుసా?

సైన్స్ చాలా గొప్పది. ఎన్నో వింతలు విశేషాల గురించి తెలియజేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి చాలా విషయాలు మనుషులు తెలుసుకోలేకపోయారు. కానీ సైన్స్ ప్రస్తుతం ప్రతి ఒక్క విషయానికి క్లారిటీ ఇస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 25, 2024 / 06:49 PM IST

    First Landmass On Earth

    Follow us on

    First Landmass On Earth: మన విశ్వం అనంతమైనది ఇందులో ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు కూడా చాలా ఉన్నాయి. కొన్నైతే మనం నమ్మడం కష్టమే సుమా. వాటిని ఎంత నమ్మాలి అనిపించినా ఇంతకీ ఇది నిజమేనా అనిపిస్తుంది. నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఎంతో మంది సైంటిస్టులు విశ్వాన్ని రోజూ జల్లెడ పడుతూ కొత్త విషయాలను సమాజానికి తెలియజేసే పనిలో ఉంటారు. ఇప్పటికీ కూడా కొన్ని సైన్స్ సిద్ధాంతాలనే ప్రశ్నిస్తుంటాయి. అందుకు కారణాలేంటో తెలుసుకునేందుకు సైంటిస్టులు వారి ప్రయత్నాలను మాత్రం ఆపకుండా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక విషయం మనం తెలుసుకుందాం. ఈ విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్న తర్వాత కాస్త గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా?

    సైన్స్ చాలా గొప్పది. ఎన్నో వింతలు విశేషాల గురించి తెలియజేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి చాలా విషయాలు మనుషులు తెలుసుకోలేకపోయారు. కానీ సైన్స్ ప్రస్తుతం ప్రతి ఒక్క విషయానికి క్లారిటీ ఇస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మొత్తం నీటితో చుట్టుముట్టబడి ఉండేది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత భూ ఉపరితలం కొద్దిగా పెరగడంతో ఖండాలు ఏర్పడ్డాయి అంటారు శాస్త్రవేత్తలు. నీటి పైన ఉన్న మొదటి భాగం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడు మనం అదే విషయాన్ని తెలుసుకుందాం.

    నీటిపైన ఏర్పడిన మొదటి భాగం భారతదేశంలోనే ఒక భాగమని ఇటీవలి పరిశోధనలో తేలింది. భూమిపై మొదటి భూభాగం ఏంటి అని తెలుసుకోవడానికి ఒక బృందం ఖండాలుగా ఉన్న అన్నింటిని పరిశోధన చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి రాళ్లను తీసుకెళ్లి పరీక్షించారట శాస్త్రవేత్తలు. వారు చేసిన పరిశోధనల్లో రెండు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు తెలిసాయి. 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు నీటి అడుగున భూమి ఏర్పడి ఉండవచ్చని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే 3 బిలియన్ సంవత్సరాల క్రితం ఖండాలు కనిపించాయని కూడా కనుగొన్నారు.

    భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ శిలలు ప్రపంచంలోనే మొదటి నీటి అడుగున ఉన్న భూమిగా వెల్లడైంది. సింఘ్‌భూమ్ ప్రాంతంలోని శిలలు సముద్రపు ఇసుక , నదీ గర్భాల ఇసుకను ఏర్పరచి ప్రపంచంలోనే మొదటి నీటి అడుగున ఉన్న భూమిగా నిలిచాయి. ఈ శిలల్లోని జిర్కాన్ అనే ఖనిజం ఆధారంగా ఈ శిలలు ఏర్పడ్డాయట. అయితే ఇవి ఏర్పడి దాదాపు 3 బిలియన్ సంవత్సరాలు అంటున్నారు. ఇలా ప్రపంచంలోనే నీటి అడుగున వచ్చిన మొదటి దేశంగా భారత్ నిలిచింది అని కనుగొన్నారు పరిశోధకులు. మొత్తం మీద ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.