Viral News : ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఆ సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే.. మరింత పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు అసలు సమస్య పక్కకు వెళ్లిపోయి.. కొత్త సమస్య వెలుగులోకి వస్తుంది.. ఆ తర్వాత తలనొప్పి మరింత పెరుగుతుంది.. ఓ పెద్ద మనిషి కూడా తన సమస్య విషయంలో ఇలానే ఆలోచించాడు. అది పెరిగి పెద్దదయింది. చివరికి పోలీసుల దాకా వెళ్ళింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడు ఉన్న ప్రాంతంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. గేటు వేసినప్పటికీ అవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ కుక్కలు ఇంట్లోకి ప్రవేశించడమే కాదు.. అరుస్తున్నాయి, కర్రతో బెదిరిస్తే కరుస్తున్నాయి. దీంతో ఏం చేయాలో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. పైగా ఇటీవల గేటు వేసినప్పటికీ.. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించాయి.. ఏం చేయాలో అంతుపట్టక ఆ వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంట్లోకి వచ్చారు.
పోలీసులు ఇంట్లోకి వచ్చిన తర్వాత.. సమస్య ఏమిటో చెప్పాలని ఆ వ్యక్తిని అడిగారు.. దానికి అతడు “నా ఇంట్లోకి కుక్కలు వస్తున్నాయి సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిరోజులుగా నేను ఆ కుక్కలతో వేగలేక పోతున్నానని” చెప్పాడు.. దానికి పోలీసులు ” మీ ఇంట్లోకి కుక్కలు వస్తే మేము బయటికి వెళ్లగొట్టాలా? కుక్కలు ఇంట్లోకి రాకుండా గేటు వేసుకోవాలి. లేకుంటే ఇంకా ఏదైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప ఇలా పోలీసులకు సమాచారం అందించడం ఏంటి” అని వారు ఆ వ్యక్తిని నిలదీశారు..” కుక్కలతో ఇబ్బంది పడుతున్నాను. మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారని ఫోన్ చేశానని” ఆ వ్యక్తి పోలీసులతో అన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ వీడియో అక్కడితోనే ఎండ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన కొంతమంది ఆ వ్యక్తికి బాసటగా నిల్వగా.. మరి కొంతమంది ఇన్నాళ్లు కోతుల బెడదే అనుకుంటే.. ఇప్పుడు ఆ స్థానంలో కుక్కలు చేరాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయని 100 నెంబర్కి కాల్ చేసి కంప్లేట్ చేస్తున్న మనుషులు. pic.twitter.com/MH0imz02h6
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More