Watch Test Series Free: శుక్రవారం నుంచి ఇంగ్లీష్ గడ్డమీద టెస్ట్ సిరీస్ మొదలు కాబోతోంది. గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు స్టోక్స్ బృందాన్ని ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది.
ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ శుక్రవారం నుంచి మొదలుపెడుతుంది. 2025 -27 డబ్ల్యూటీసీ సిరీస్లో భారత్ ఆడే అత్యంత సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో భారత్ ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతుంది. జూన్ లో మొదలై.. ఆగస్టు వరకు కొనసాగుతుంది.. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ బంగ్లా జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఈ సిరీస్ కోసం గిల్ జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. ఆంగ్ల జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అవసరమైన కసరత్తు మొత్తం చేస్తోంది. ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెమటోడ్చుతూ పరుగులు తీస్తున్నారు. ఇక బౌలర్లైతే నిర్విరామంగా సాధన చేస్తూ వికెట్లు పడగొడుతున్నారు. ఇక ఇటీవల అనధికారిక టెస్టులలోనూ భారత ప్లేయర్లు అద్భుతమైన ప్రతిభ చూపించారు. ముఖ్యంగా కేఎల్ సూపర్ ఫాం కొనసాగించాడు. అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసి పరుగుల వరద సృష్టించాడు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..
ఆంగ్ల జట్టుతో జరిగే సిరీస్ హక్కులను సోని దక్కించుకుంది.. సోనీ స్పోర్ట్స్ లోనే ఈ మ్యాచ్ లు చూసే అవకాశం ఉంది. ఇక ఓటిటిలో అయితే సోనీ లీవ్ యాప్ లో చూసే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం సభ్యత్వాన్ని తీసుకోవాలి. నిర్ణీత రుసము చెల్లించాలి. జియో లాగా సోనీ లీవ్ ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించలేదు. దీంతో అభిమానులు మ్యాచ్ చూడాలి అంటే కచ్చితంగా సోనీ లీవ్ యాప్ లో సభ్యత్వాన్ని స్వీకరించాలి. అలా కాదనుకుంటే దూరదర్శన్లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం ఉంది. డిడి స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ఉచితంగా చూడవచ్చు.. అయితే ఈ సిరీస్ ప్రసార హక్కుల కోసం స్టార్ స్పోర్ట్స్, సోనీ తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే చివరికి సోనికి ఆ హక్కులు లభించాయి. సోనీ భారీ మొత్తంలో కోట్ చేయడంతో ఆ హక్కులు వారికి లభించాయి. అయితే ఈ సిరీస్ ను గొప్పగా ప్రజెంట్ చేయడానికి సోనీ ప్రయత్నాలు చేసింది. అంతేకాదు తెలుగులో కూడా కామెంట్రీ నిర్వహిస్తోంది. లెజెండరీ ప్లేయర్లతో కామెంట్రీ కొనసాగిస్తోంది. ఒకరకంగా క్రికెట్ అభిమానులకు మరింత దగ్గర కావడానికి సోనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాలంలో స్టార్ స్పోర్ట్స్, జియో మాత్రమే మేజర్ టోర్నీలను ప్రసారం చేసే హక్కులను దక్కించుకున్నాయి. వాటిలో మాత్రమే ఆ మ్యాచులు ప్రసారమవుతున్నాయి. అయితే ఇప్పుడు సోనీ ఆ హక్కులు దక్కించుకోవడంతో.. తన ప్రస్థానాన్ని మెరుగుపరచుకోవడానికి ఆ ఛానల్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఉచితంగా చూసే సౌలభ్యం ఉంటుంది. అయితే డిడి స్పోర్ట్స్ కు ఈ మ్యాచ్ ప్రసార హక్కులు ఎందుకు ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. సుదీర్ఘ ఫార్మాట్ లో భారత్ ఆడిన మ్యాచులు డిడి స్పోర్ట్స్ లో ప్రసారం చేయాలనే నిబంధన వల్లే ఇలా చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆంగ్ల జట్టు మనదేశంలో పర్యటించినప్పుడు కూడా డిడి స్పోర్ట్స్ లో ఆ సిరీస్ టెలికాస్ట్ అయింది. అంటే అప్పటి సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారని తెలుస్తోంది.