China: పెళ్లి అనేది రెండు మనస్సుల కలయిక. ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని సంప్రదాయాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. వరుడు, వధువు ఇద్దరూ కూడా పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటారు. కోరుకున్న భాగస్వామి తమ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే తమని అర్థం చేసుకుని, బాగా చూసుకునే భర్త లైఫ్‌లోకి రావాలని అనుకుంటారు. వారితో జీవితాంతం సంతోషంగా ఉండాలని భావిస్తారు. అయితే పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో కొన్ని ఆచార సంప్రదాయాలు ఉంటాయి. అక్కడ ఉన్న ప్రజలు ఆ ఆచార సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తుంటారు. ఇలానే ఓ దేశంలోని అమ్మాయిలు అబ్బాయిలను కాకుండా శవాలను వివాహం చేసుకుంటారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఎందుకు ఈ దేశంలోని అమ్మాయిలు శవాలను వివాహం చేసుకుంటారు? దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.
Also Read: SRH ఆటగాడు క్లాసెన్ కు షాక్ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా!
మనకి పొరుగు దేశమైన చైనాలో అమ్మాయిలు శవాలను వివాహం చేసుకునే ఆచారం ఉంది. దీన్నే దెయ్యాల వివాహం అని అంటారు. ఇక్కడ అమ్మాయిలు అందరూ కూడా చనిపోయిన వారిని పెళ్లి చేసుకుంటారు. ఈ ఆచారం ఇక్కడ 3000 సంవత్సరాల నుంచి ఉందట. అయితే ఇలా వారు శవాలను పెళ్లి చేసుకోవడానికి ఓ కారణం ఉందట. పెళ్లి కాకుండా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఉండేందుకు శవాలను వివాహం చేసుకుంటారట. మృతదేహంతో వివాహం జరిగే ఆచారం కేవలం చైనాలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా లేదు. ఇలా చేస్తే వారు తర్వాత జన్మలో బ్రహ్మచారిగా ఉండరని ఈ ఆచారం పాటిస్తారట. అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా శవాలను వివాహం చేసుకుంటారట. ఇప్పటికి ఈ ఆచారం చైనలో వెనుకపడిన ప్రాంతాల్లో ఉంది. అయితే ఈ వివాహాలకు ఇక్కడ ప్రజలు ఎక్కువగా డబ్బులు చెల్లించి మరి వివాహాలు నిర్వహిస్తారు. చైనా ప్రభుత్వం ఇది చట్టవిరుద్ధమని చెప్పిన కూడా ఇంకా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
ఇలాంటి ఆచారాలు, సంప్రదాయాలు ఎన్నో ప్రపంచం లో ఉన్నాయి. ఇంత జనరేషన్ లో కూడా వీటినే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలాంటివి ఎక్కువగా ఆ కాలం నుంచి ఉన్నవారు పాటిస్తున్నారు. ఈ కాలం వారు చాలా తక్కువగా మూఢ నమ్మకాలను పాటించడం లేదు. అయితే అనుకున్న కోరికలు కోసం కొందరు ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తున్నారు.