Sleep : అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని మాత్రమే కాకుండా మనుషుల జీవితానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. వీటిలో ఆరోగ్య సూత్రాలను కూడా పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి అనే విషయం తో పాటు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి అనే సూచనలను అందించారు. చాణక్యుడు అందించిన సూత్రాలను కొందరు మౌర్య సామ్రాజ్యకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. మరికొందరు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. కానీ ఈ సూత్రాలను పాటించడం ద్వారా ఎంతోమంది తమ జీవితాలను సక్రమ మార్గంలో నడిపించుకుంటున్నారు. అయితే చాణక్య నీతి ప్రకారం మధ్యాహ్నం నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : తల ఎటువైపు పెట్టి నిద్రపోవాలి? ఎటువైపు ఉంచకూడదు?
కొందరికి మధ్యాహ్నం నిద్రపోయా అలవాటు ఉంటుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఈ నిద్రను ఆపుకోలేరు. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే వీరు లంచ్ చేసిన తర్వాత కాస్త కునుకు తీసిన అది గాఢ నిద్రగా మారిపోతుంది. ఫలితంగా చేసే పని సక్రమంగా ముందుకు వెళ్ళదు. దీంతో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి పనితీరుపై బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అందువల్ల మధ్యాహ్నం కార్యాలయాల్లో నిద్రపోకుండా ఉండే ప్రయత్నం చేయాలి.
సాధారణంగా మనిషి నిద్ర పోయినప్పుడు శ్వాస హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. అయితే మధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణము ఉండదు. దీంతో ఈ సమయంలో శ్వాస ఎక్కువగా ఉండడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటారు. రాత్రి సమయంలో ఎలాగో నిద్రపోతారు కాబట్టి ఈ సమయంలో కూడా హార్ట్ బీట్ ఎక్కువగా అవుతుంది. ఇలా పదేపదే హార్ట్ బీట్ పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కొందరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర పోయిన తర్వాత ఎక్కువగా అలసిపోతారు. సాయంత్రం లేచిన తర్వాత ఏదో తెలియని బాధతో ఉంటారు. దీంతో ఏ పని సక్రమంగా పూర్తి చేయరు. ముఖ్యంగా కొందరు వ్యాపారాలు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కాసేపు నిద్ర పోవాలని అనుకుంటారు. అయితే మిగతా వారి కంటే మీరు ఉత్సాహంగా పని చేయలేరు. అందువల్ల మధ్యాహ్నం నిద్రపోయే ప్రయత్నం చేయొద్దు.
అయితే చానక్యుడు చెప్పిన ప్రకారం మధ్యాహ్నం కొందరికి నిద్రపోయే హక్కు ఉందని అంటున్నారు. గర్భిణులు, పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం నిద్ర పోవాలని అంటున్నారు. ఎందుకంటే వీరు ఎక్కువసేపు నిద్రపోతేనే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. అందువల్ల వీరు మినహా మిగతావారు మధ్యాహ్నం కాకుండా రాత్రి సమయంలోనే ఎక్కువగా నిద్రపోయే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అయితే రాత్రి సమయంలో విధులు నిర్వహించే వారికి సైతం ఈ సూత్రాలు వర్తించమని అంటున్నారు.
Also Read : రాత్రి నిద్ర పోయే సమయంలో ఇలా చేస్తున్నారా? డేంజర్ లో పడ్డట్లే..