Heinrich Klaasen: టి20 వరల్డ్ కప్ లో టీం మీడియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతది ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. క్లాసెన్ బ్యాటింగ్లో దూకుడు కొనసాగిస్తాడు. కీపింగ్ లో అద్భుతాలు చేస్తాడు. అందువల్లే క్లాసెన్ కు సౌత్ ఆఫ్రికాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కొద్దిరోజులుగా క్లాసెన్ సరిగా ఆడటం లేదు. కీలకమైన మ్యాచ్ లలో ఆకట్టుకోవడం లేదు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం లేదు. దీంతో అతడికి సౌత్ ఆఫ్రికా క్రికెట్ మేనేజ్మెంట్ షాక్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు 2025 -26 కు సంబంధించి విడుదల చేసిన 18 ప్లేయర్ల జాబితాలో క్లాసెన్ పేరు లేదు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం క్లాసెన్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఐసీసీ ఈవెంట్స్, కీలక సిరీస్ లలో పాల్గొనేందుకు మిల్లర్, డసెన్ కు హైబ్రిడ్ కాంట్రాక్టు లో చోటు కల్పించింది.
Also Read: కోహ్లీ దంచికొడుతున్నాడు.. రోహిత్ తండ్లాడుతున్నాడు..
23 కోట్లకు కొనుగోలు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం 2025 ఐపీఎల్ కు సంబంధించి గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో క్లాసెన్ ను 23 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ క్లాసెన్ గత సీజన్ స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 27 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. చివరికి సాయి సుదర్శన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అంతకుముందు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 33 పరుగులు చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు మేనేజ్మెంట్ క్లాసెన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అతని అభిమానులకు రుచించడం లేదు. ” క్లాసెన్ అద్భుతంగా ఆడతాడు. క్లిష్ట పరిస్థితుల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ నిర్మిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేస్తాడు. అటువంటి ఆటగాడిని కాంట్రాక్ట్ నుంచి తొలగించడం నిజంగా ఆశ్చర్యకరం. అలాంటి ఆటగాడిని కాంట్రాక్ట్ నుంచి తొలగించడం వల్ల ఆ ప్రభావం మిగతా ప్లేయర్లపై పడుతుంది. మరి దీనిని సౌత్ ఆఫ్రికా క్రికెట్ మేనేజ్మెంట్ ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి. అద్భుతమైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వాలి గాని.. ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడం సరైన చర్య కాదు. ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో క్లాసెన్ కు తిరుగులేదు. వన్డేలలో కూడా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అటువంటి ఆటగాడిని ఇలా చేయడం నిజంగా దారుణమని” హెన్రిచ్ క్లాసెన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
Also Read: తిలక్ వర్మ రిటైర్డ ఔట్‌పై హార్ధిక్ అసహనం.. ఏమన్నాడంటే?