Homeవింతలు-విశేషాలుChakor bird story: వెన్నెల తాగి బతుకుతుంది.. నిరీక్షణకు మారుపేరుగా ఉంటుంది.. ఈ పక్షి కథ...

Chakor bird story: వెన్నెల తాగి బతుకుతుంది.. నిరీక్షణకు మారుపేరుగా ఉంటుంది.. ఈ పక్షి కథ ఎంతో ఆసక్తికరం

Chakor bird story: ఒకరి కోసం మనం ఎదురు చూడాలంటే.. వారి మీద ప్రేమైనా ఉండాలి.. లేదా ఇష్టమైనా ఉండాలి.. వారు మనకు ఎంతో ఆప్తులై ఉండాలి. ఎటువంటి సంబంధం లేకుండా ఎదురు చూడడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ పక్షి ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎటువంటి సంబంధం లేకుండానే.. ఎదుటివారి కోసం అదేపనిగా చూస్తూ ఉంటుంది. ఎదురుచూపు అనే పదానికి ఈ పక్షి పర్యాయపదం.

ఏ పక్షులైనా సరే నీటిని తాగి బతుకుతాయి. లేదా ఆహారం తిని బతుకుతాయి. ఇంకో జీవి ఆహారాన్ని గనుక సేకరిస్తే.. దొడ్డి దారిన దొంగలించి బతుకుతాయి. కానీ పక్షి మాత్రం ఆహారం తినదు. నీళ్లు కూడా తాగదు. కేవలం పౌర్ణమి నాటి చంద్రుడిని చూసుకుంటూ బతికేస్తుంది. ఒకరకంగా దానిని మౌన ఆరాధన అని పిలవచ్చు. చందమామ అంటే ఈ పక్షికి విపరీతమైన ఇష్టం. ఎప్పటికీ పైకి చూస్తూనే ఉంటుంది. చందమామ కాంతిని అమృతంలాగా భావించి.. ఆహారంగా తీసుకుంటుంది.

దీనిని చకోర పక్షి అని పిలుస్తుంటారు. మన పురాణాలు, జానపద కథల ప్రకారం ఈ పక్షి కేవలం మేఘాల నుంచి పడుతున్న వాననిటిని తాగుతుంది. ఆ నీటిని మాత్రమే తాగి జీవిస్తుంది. ఈ పక్షికి చందమామ అంటే విపరీతమైన ఇష్టం. చందమామ పౌర్ణమి రోజు నిండుగా కనిపిస్తాడు. ఆరోజు పైకే చూసి వెన్నెల కాంతిని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. చంద్రుడిని మౌనంగా ఆరాధిస్తూ ఉంటుంది. పున్నమి నాడు చంద్రుడు వెలిగిపోతుంటే రకరకాల ధ్వనులు చేస్తూ ఉంటుంది. అందువల్లే మన పురాణాలు, జాతీయాలలో చకోర పక్షిలాగా ఎదురు చూడటం అనే జాతీయం పుట్టింది. ఈ పక్షి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అడవుల వృద్ధిలో సహాయపడుతూ ఉంటుంది.

ఈ పక్షులు ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతుంటాయి. భాగస్వామి దూరమైతే తట్టుకోలేక విలపిస్తూ ఉంటాయి. రైతులకు సహకారులుగా ఈ పక్షులు ఉపయోగపడుతుంటాయి. పంట పొలాలలో సహజమైన బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంటాయి. పంటలను చీడపీడలు ఆశించినప్పుడు.. వాటిని తినేస్తుంటాయి. అందువల్లే ఈ పక్షులను రైతులకు అత్యంత ఉపకారులు అని పిలుస్తుంటారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular