Flight Rule: విమాన ప్రయాణం ఇప్పుడు మధ్య తరగతికి అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న వేగం.. విధి నిర్వహణలో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు పర్యటించాల్సి రావడం, తదితర కారణాలతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. తాజాగా ఒక్కరోజే 5 లక్షల మంది ప్రయాణికులు భారత దేశంలో ప్రయాణించి రికార్డు సృష్టించారు. అయితే విమాన ప్రయాణాలు.. సాధారణ బస్సు, రైలు ప్రయాణంలా ఉండదు. ప్రయాణికులకు విమానయాన సంస్థలు నిబంధనలు జారీ చేశాయి. వాటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక విమానంలో ఏది పడితే అది తీసుకెళ్లడానికి వీలు ఉండదు. హిందువులు అతి పవిత్రంగా భావించి కొబ్బరి కాయలు కూడా విమానంలో తీసుకెళ్లడం నిషేధం. కొబ్బరికాయే కదా ఏం కాదని రహస్యంగా తీసుకెళ్లాలనుకుంటే.. అది చాలా ప్రమాదం. కొందరు కొబ్బరి ప్రసాదం విదేశాల్లోని తమ పిల్లలకు తీసుకెళ్దామనుకుంటారు. కానీ కొబ్బరి చిప్ప తీసుకెళ్లం కూడా నిషేధమే.
ముందే తెలుసుకోవాలి…
విమానంలో ప్రయాణించే సమయంలో తమ బ్యాగులో ఏ వస్తువులు ఉంచాలి.. ఏయే వస్తువులు ఉంచకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిషేధిత వస్తువులు ఉంటే విమానంలో అధికారులు ఎక్కనివ్వరు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాగు చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. నిషేధిత వస్తువులు ఉంటే.. వాటిని తీసేసి పంపిస్తారు. రవాణా చేయాల్సిన వస్తువుల గురించి ముందే తెలుసుకుంటే ప్రయాణం సులభం అవుతుంది.
కొబ్బరికాయా ప్రమాదమే..
విమానంలో ప్రయాణించే వారు తీసుకెళ్లకూడని ఐటమ్స్‌లో ఎండు కొబ్బరి, కొబ్బరి కాయ కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న తమ పిల్లలు, బంధువులకు భారతీయులు కొబ్బరికాయలు, కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ, వాటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదు. కొబ్బరిలో అధిక మొత్తంలో నూనె ఉంటుంది. విమాన ప్రయాణాల్లో ఇది పేలుడకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి విమానం లోపల వేడిని తాకితే ఎండు కొబ్బరి స్పార్క్ ద్వారా మండింబడుతుంది. ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. కొబ్బరి పీచు కూడా మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరికాయలను నిషేధించారు. అయితే కొన్ని విమానయాన సంస్థలు చెక్–ఇన్ లగేజీలో చిన్న కొబ్బరి ముక్కలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తాయి.
శబరిమల యాత్రీకులకు
కొన్నేళ్లుగా శబరిమల వెళ్లేవారు విమానాల్లో వెళ్తున్నారు. స్వాములు ఇరుముడి కట్టుకుంటారు. ఆ ఇరుముడిలో కొబ్బరికాయ ఉంటుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రమే ఇరుముడిని అనుమతి ఇస్తున్నాయి. చాలా సంస్థలు ఇరుముడిలో కొబ్బరికాయ ఉన్నందున అనుమతి ఇవ్వడం లేదు. ఇక సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, పప్పులు, మాంసం, చేపలు కూడా వినమానాల్లో తీసుకెళ్లడం నిషేధం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ban on the transportation of coconuts in airplanes do you know how dangerous it is if you carry it secretly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com