Homeవింతలు-విశేషాలుWildlife Research: భాగస్వామితో కలవగానే.. ఈ ప్రాణులు కన్నుమూస్తాయి..

Wildlife Research: భాగస్వామితో కలవగానే.. ఈ ప్రాణులు కన్నుమూస్తాయి..

Wildlife Research: సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం హాలీవుడ్ నుంచి ఒక సినిమా తెలుగులో డబ్ అయింది. అందులో ఆ తరహా సన్నివేశాలు అధికంగా ఉంటాయి. అందువల్లే ఆ చిత్రాన్ని పెద్దలకు మాత్రమేనని సర్టిఫికెట్ వేసి మరి ప్రదర్శించేవారు. అందులో ఓ మహిళ చనిపోతుంది. ఆమెను కొంతమంది కావాలని చంపేస్తారు. ఆ తర్వాత దయ్యం గా మారుతుంది. అనంతరం నన్ను చంపేసిన వారిని మోహిస్తుంది. వారితో ఆ పని చేసిన తర్వాత చంపేస్తుంది.

ఈ ఉపోద్ఘాతం మాదిరిగానే ప్రకృతిలో కొన్ని జంతువులు ఉంటాయి. అవేవీ దయ్యాలుగా మారవు. కాకపోతే ఈ ప్రాణులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇవి తమ జీవిత భాగస్వామితో కలిసిన తర్వాత వెంటనే చనిపోతాయి.. బీబీసీ వైల్డ్ లైఫ్ పరిశోధనలో ఈ విషయం తేలింది.. గ్రీన్ అనకొండ, మగ తేనెటీగలు, అమెజాన్ కప్ప, తీరిక మాదిరిగా ఉండే యాంటీ చినుస్ మార్స్ పియాల్స్, వాస్ప్ స్పైడర్స్, అక్టోపస్, గొల్లభామను పోలివున్న ప్లేయింగ్ మాంటిస్, ఫస్ పిక్ సల్మాన్ , రెడ్బ్యాక్ స్పైడర్, లాబర్డ్ ఊసరవెల్లి వంటి జంతువులు తమ భాగస్వాములతో కలిసిన సమయంలో చనిపోతాయి.

భాగస్వాములతో కలిసేటప్పుడు ఈ జంతువులు అధిక హార్మోన్లను విడుదల చేస్తాయి. కలయిక పూర్తి అయిన తర్వాత శక్తిని పూర్తిగా కోల్పోతాయి. ఆ సమయంలో వాటికి విపరీతమైన ఆకలి వేస్తుంది. దీంతో ఆకలిని తీర్చుకోవడానికి అవి తమ భాగస్వాములను తినేస్తాయి. ఆ సమయంలో వాటికి అలా తింటున్నామని తెలియదు. కాకపోతే ఆకలి తీర్చుకోవడానికి అవి అలా చేస్తుంటాయి. అయితే మగ భాగస్వాములు స్త్రీ భాగస్వాముల చేతిలో ఇలా చనిపోవడం విశేషం. కలయిక తర్వాత స్త్రీ భాగస్వామ్యలు తమ పురుష భాగస్వాములను తినేస్తుంటాయి. అందువల్లే ఈ జాతుల్లో ఎక్కువగా స్త్రీ జంతువులు మాత్రమే ఉంటాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే మగ భాగస్వాములు స్త్రీ భాగస్వాములను తినేస్తుంటాయి. కాకపోతే ఇలా జంతువులు కలయిక సమయం తర్వాత చనిపోవడం ఈ జాతుల్లోనే ఉంటుంది.

అధిక హార్మోన్లను విడుదల చేసే క్రమంలో ఆ జంతువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయట. శరీరంలో శక్తిని మొత్తం కోల్పోతాయట. ఇవి అలా శక్తిని కోల్పోవడానికి జన్యుల అమరికనే ప్రధాన కారణమని తెలుస్తోంది. జన్యువులలో తేడాల వల్లే ఇలా జరుగుతుందట. అధిక శక్తి విడుదల చేస్తున్నప్పుడు ఆ జంతువులు తీవ్రంగా అరుస్తాయట. ఆ ఉద్రేకంలోనే భాగస్వాములను తినేస్తాయట.. అయితే శక్తిని కోల్పోయిన తర్వాత.. ఆ భాగస్వామి జంతువు మీద ఏకపక్షంగా దాడి చేస్తాయట. కొన్ని సందర్భాలలో భాగస్వామ్య జంతువు తిరగబడినప్పటికీ.. ఆడ జంతువులు అంతకుమించిన స్థాయిలో దాడి చేస్తాయట. శక్తిని కోల్పోయిన తర్వాత కూడా అవి ఆ స్థాయిలో దాడి చేయడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిణామంపై పరిశోధనలు చేస్తున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular