Fact Check: అక్కడిదాకా ఎందుకు అంతటి సహారా ఎడారిలోనూ ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అక్కడ కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడారిలోని ఓయాసిస్ ప్రాంతాలు చెరువులలాగా దర్శనమిచ్చాయి. వర్షాలు విస్తారంగా కురవడం వల్ల ఎడారి ప్రాంతాలలో అక్కడక్కడ నీటి నిల్వలు ఏర్పడ్డాయి. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పచ్చని పైరు ఏర్పడింది. ఇక ఇటీవల కాలంలో కురిసిన వర్షాల వల్ల ఖర్జూర చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి.. బహుశా వచ్చే ఏడాది ఖర్జూర చెట్లు విస్తారంగా కాపు కాసే అవకాశం ఉంది. అయితే అంతటి సహారా ఎడారిలోనూ వర్షాలు కురుస్తుంటే.. ఓ ప్రాంతంలో మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా వర్షం పడలేదు. భవిష్యత్తులో వర్షం కురిసే అవకాశం కూడా లేదని తెలుస్తోంది.
Also Read: Saraswathi Pushkaralu : సరస్వతి పుష్కరాలు :కాళేశ్వరంకు వెళ్లే దారులు ఇవీ
ఇంతవరకు వర్షం కురువని ప్రాంతం ఇదే!
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతముగా మేఘాలయలోని మాసిన్రాం రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలో ఏడాది మొత్తం వర్షం కురుస్తూనే ఉంది. అయితే అసలు వర్షం కురువని గ్రామం కూడా ఒకటి ఉంది. ఆ గ్రామం పేరు అల్ – హుతైబ్.. యెమెన్ రాజధాని సనాకు పశ్చిమ భాగంలో ఉంటుంది. అయితే ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఉంటుంది. శాస్త్రవేత్తల అధ్యయన ప్రకారం మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఈ గ్రామం ఉంటుంది. అందువల్ల ఇక్కడ వర్షాలు కురవడం లేదు. అయితే ఇక్కడి వాతావరణం విషయానికి వస్తే ఉదయం పూట ఎండ కాస్తుంది. రాత్రిపూట విపరీతంగా చలి పెడుతుంది. అయితే ఇది చాలా చిన్న గ్రామం కావడంతో.. ఇక్కడి ప్రజలు సాగునీటి అవసరాల కోసం.. తాగునీటి అవసరాల కోసం. కింది ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటారు. ఆ నీటిని కూడా అత్యంత జాగ్రత్తగా వాడుకుంటారు. ఇక వర్షం కురువదు కాబట్టి.. ఇక్కడి ప్రజలు కేవలం ఖర్జూర పండ్లు విక్రయించి ఉపాధి పొందుతుంటారు. ఇక యువకులైతే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతారు. ఈ గ్రామంలో మహా అయితే వెయ్యిలోపు జనాభా ఉంటుంది.. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ గ్రామం కాలగర్భంలో కలిసిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వర్షాలు కురువక పోయినప్పటికీ.. ఇసుక తుఫాన్లు ఏర్పడిన సమయంలో మాత్రం.. ఈ ప్రాంతంలో విస్తారంగా సుడిగాలులు విస్తుంటాయి. అవి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంటాయి. అందువల్లే ఈ ప్రాంతంలో ప్రజలు తమ నివాసాలను అత్యంత అధునాతన పద్ధతిలో నిర్మించుకుంటారు. ఇక ఈ ప్రాంతంలో ఖర్జూర పండ్లతో పాటు.. మాంసం విక్రయాలు కూడా జోరుగా సాగుతుంటాయి. కొంతమంది బడా వ్యాపారులు ఇక్కడ వ్యాపార సముదాయాలు నిర్వహించి.. బిజినెస్ చేస్తున్నారు.. నీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా పైప్ లైన్లు ఏర్పాటు చేసుకొని.. తమ అవసరాలు వెళ్లదీసుకుంటున్నారు.
Also Read: Gold Price Today : బంగారం ధరలు.. వారం రోజుల్లో రూ.8,000 తగ్గింపు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?