Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు రూ.8,000 తగ్గాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారికి ఇది మంచి వార్త అని అనుకోవచ్చు. అయితే బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేసేవారికి నష్టం కలిగే అవకాశం ఉందని అంటన్నారు. అయితే దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 16న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95, 130గా ఉంది. మే 15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.86,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువాం రూ.1000కి పైగా తగ్గింది. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,280గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,720 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,130 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,130తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,130తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,130తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,08,000గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.1000 తగ్గింది. వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.97,000గా ఉంది. ముంబైలో రూ.97,000, చెన్నైలో రూ.1,08,000 బెంగుళూరులో 97,000, హైదరాబాద్ లో రూ. 1,08,000 తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో తసుకున్న నిర్ణయాలతో తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య ఒప్పందాలు మారుతుండడంతోనూ బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు బంగారంపై కాకుండా ఇతర ఇన్వెస్ట్ మెంట్లు చేస్తున్నారు.