Saraswathi Pushkaralu : ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అయితే దేశంలోని అన్ని నదుల్లో ప్రతి ఏడాది ఒక నదికి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది సరస్వతీ పుష్కరాలు కొనసాగనున్నాయి. 2025 మే 14వ తేదీ సాయంత్రం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతీ నది పైకి కనిపించకుండా అంతర్వాహిగా ప్రవహిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం లోని గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోట అంతర్వాహిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు. పుష్కరాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. అయితే ఈ పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరారున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నందున.. ఆయా చోట నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే రైల్వే మార్గం ద్వారా కూడా పుష్కరాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎటువైపు నుంచి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం..
Also Read : త్రివేణి సంగమంలో పుష్కర మహోత్సవం.. కాళేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం
సరస్వతీ పుష్కరాలకు హైదరాబాద్ నుంచి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక వాహనంలో వెళ్తే ఘట్కేసర్ రింగ్ రోడ్ నుంచి భువనగిరి, జనగామ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోవచ్చు. ఈ జిల్లాలోని గుడెప్పాడ్ క్రాస్ రోడ్ వద్ద నుంచి పరకాల మీదుగా కాలేశ్వరం చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి 265 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులో వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకొని అక్కడి నుంచి కూడా ప్రత్యేక బస్సులో వెళ్లే అవకాశం ఉంది.
కరీంనగర్ నుంచి కాలేశ్వరానికి ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి 133 కిలోమీటర్ల దూరంలో కాలేశ్వరం చేరుకోవచ్చు. అలాగే కరీంనగర్ నుంచి పెద్దపల్లి కి చేరుకొని అక్కడి నుంచి కూడా ప్రత్యేక భాషలో కాలేశ్వరం వెళ్లే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ నుంచి కాళేశ్వరానికి 227 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకునేవారు ఉట్నూరు, లక్షెట్టిపెట్ట మీదుగా చెన్నూరు, సిరోంచ నుంచి కాళేశ్వరం వరకు చేరుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పుష్కరాలకు వెళ్లాలని అనుకునేవారు విశాఖపట్నం, గుంటూరు మీదుగా వరంగల్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో కాలేశ్వరానికి చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి మహబూబాబాద్, నర్సంపేట మీదుగా నేరుగా కాలేశ్వరానికి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఖమ్మం నుంచి 221 కిలోమీటర్ల దూరంలో కాలేశ్వరం ఉంటుంది.
మహారాష్ట్ర నుంచి వచ్చేవారు గడ్చిరోలి నుంచి శిరోంచ మీదుగా కాలేశ్వరానికి రావచ్చు. చతిస్గడ్ నుంచి వచ్చేవారు బీజాపూర్ మీదుగా కాలేశ్వరానికి 122 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు.
బస్సులు, ప్రత్యేక వాహనాల్లో మాత్రమే కాకుండా రైలు ప్రయాణం కూడా సౌకర్యం ఉంది. హైదరాబాదు నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో కాలేశ్వరం కు వెళ్లవచ్చు. ఇలా వివిధ మార్గాల ద్వారా సరస్వతీ పుష్కరాలకు వెళ్లే అవకాశం ఉంది.