https://oktelugu.com/

Ghost in Home: ఇంట్లో సెన్సార్ కెమెరా ఏర్పాటు చేస్తే ఫోటోలు తీసింది.. అందులో దెయ్యం కనబడింది.. షాకింగ్ ఫోటోలు ఇవీ

ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరా ఒక విచిత్రమైన రూపం కదలికను గుర్తుపట్టి ఫోటో తీసింది. ఆ ఫోటో చూస్తుంటే నిజంగా దయ్యంలాగే ఉంది. దీంతో దయ్యాలు ఉన్నాయని వాదనకు బలం చేకూరుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 14, 2024 / 07:59 PM IST

    Ghost in Home

    Follow us on

    Ghost in Home: అసలు ఈ భూమి మీద దయ్యాలు అనేవి ఉన్నాయా.. ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి? విఠలాచార్య సినిమాలో చూపించినట్టు తెల్ల దుస్తులు ధరించి ఉంటాయా? మోకాళ్ళ వరకు జుట్టుతో కనిపిస్తాయా? కాళ్లు వెనక్కి తిరిగి, చేతులు ముందుకు తిరిగి, గోర్లు పెరిగిపోయి దర్శనమిస్తాయా.. వీటి గురించి ఎవరికీ ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు కానీ.. దయ్యాల పై మాత్రం ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఇంతవరకు ఎవరు దయ్యాలను నేరుగా చూసిన దాఖలాలు లేవు. కొందరు తమ దయ్యాలను చూసామని చెబుతుంటారు కానీ.. అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుందో తెలియదు. అయితే ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరా ఒక విచిత్రమైన రూపం కదలికను గుర్తుపట్టి ఫోటో తీసింది. ఆ ఫోటో చూస్తుంటే నిజంగా దయ్యంలాగే ఉంది. దీంతో దయ్యాలు ఉన్నాయని వాదనకు బలం చేకూరుతోంది.

    ఆర్థిక స్థిరత్వం పెరిగిన తర్వాత చాలామంది వారి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో లేదా వీధిలో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు.. సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు సాక్షాలుగా పనికొస్తున్నాయి. ఇక సీసీ కెమెరాలు సెన్సార్ మోషన్ టెక్నాలజీ తో పనిచేసే ఇవి కూడా ఉంటాయి. అయితే ఇవి అత్యంత క్వాలిటీ గా ఫోటోలు తీస్తుంటాయి. వీటిని ఒక కుటుంబం తమ ఇంట్లో ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ కెమెరా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. Facebook లోని The British paranormal society పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. అనంతరం దానికి సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. ” ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇంట్లో మా తల్లిదండ్రులు 15 సంవత్సరాలు పాటు జీవించారు.. వారికి తరచు మెట్లపై ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించేది. పగలు, రాత్రి కూడా ఆ శబ్దం నేర్పించేది. మాస్టర్ బెడ్ రూమ్ నుంచి బాత్ రూమ్ వర్క్ ఆ మెట్లు ఉండేవి. ఆ శబ్దాన్ని విన్నట్టు మాకు చెబితే మేము నవ్వుకొనేవాళ్ళం. కొన్ని వారాల క్రితం మేము మెట్లపై కూర్చున్నాము. ఆ సమయంలో మా పైన ఉన్న మెట్లపై ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన తర్వాత మా అమ్మ ఆ మెట్ల వైపు చూసింది. ఆ సమయంలో ఆ మెట్ల దగ్గర ఉన్న కెమెరా ఒక్కసారిగా ఫ్లాష్ అయినట్టు ఆమెకు ఒక వెలుగు కనిపించింది. ఈ విషయాన్ని మాకు చెప్పింది. ఆ తర్వాత మీ అందరం వెళ్లి కెమెరాను పరిశీలించాం. అందులో ఉన్న ఫోటోలు చూడగానే మాకు షాక్ తగిలినంత పనైందని” వారు రాసుకొచ్చారు.

    అయితే ఆ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఆ ఇంటిని 1998లో నిర్మించారు. ప్రస్తుత కుటుంబాని కంటే ముందు గతంలో ఒక కుటుంబం ఆ ఇంట్లో ఉండేది. ఆ కుటుంబంలో దంపతులతో పాటు వారి అత్తగారు కూడా ఉండేవారు. అనారోగ్యం వల్ల ఆమె చనిపోయింది. అయితే ఆమె ఎక్కడ చనిపోయిందనేది తెలియదని ప్రస్తుతం ఉన్న కుటుంబం చెబుతోంది. అయితే ఆ ఫోటోలో ఉన్నది ఆమె ఆత్మేనా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఒకవేళ ఆమె ఆత్మ కాకపోతే.. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏవేవో సొల్లు మాటలు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు.. చిత్రచిత్రమైన ఫోటోలు పోస్ట్ చేస్తుంటారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆ ఫ్లాష్ కెమెరా తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.