Bison Attack: పార్కుకు వెళ్లినప్పుడు జంతువులను చూస్తే మనసు హాయిగా ఉంటుంది. కానీ వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు పార్కు నిర్వాహకులు చెబుతూ ఉంటారు. అయినా కూడా కొందరు సందర్శకులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత సహజ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో జరిగింది. పార్క్ నిబంధనలను పట్టించుకోకుండా ఓ సందర్శకుడు బైసన్‌కు అత్యంత సమీపానికి వెళ్లాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా..
ప్రపంచ ప్రఖ్యాత సహజ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడికి లక్షలాది మంది వీక్షకులు సందర్శిస్తుంటారు. అయితే ఇటవల జరిగన ఓ సంఘటన అందరిని కలచివేసింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. బైసన్‌లు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్లవద్దని, వాహనాల నుంచి దిగవద్దని పార్క్ అధికారులు ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు ఆ సూచనలను పట్టించుకోకుండా జంతువులకు దగ్గరగా వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. వీరిలో ఓ వృద్ధుడు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బైసన్ ఒక్కసారిగా దూసుకొచ్చి వృద్ధుడిని కొమ్ములతో ఢీకొట్టింది.
బైసన్ బలమైన దాడితో బాధితుడు సుమారు రెండు మీటర్లకు పైగా గాల్లోకి ఎగిరి నేలపై పడిపోయాడు. ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఇతర పర్యాటకులు, పార్క్ సిబ్బంది అతడికి సహాయం చేసి వైద్య బృందానికి సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతని పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో బైసన్‌లు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. సాధారణంగా అవి ప్రశాంతంగా కనిపించినప్పటికీ, ప్రమాదం అనిపిస్తే అత్యంత వేగంగా దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. పెద్ద బైసన్ గంటకు సుమారు 55 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. అందుకే పర్యాటకులు కనీసం 25 మీటర్లు (సుమారు 75 అడుగులు) దూరం పాటించాలని పార్క్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.
ఎల్లోస్టోన్ పార్క్‌లో గతంలో కూడా పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘించి బైసన్‌లకు దగ్గరగా వెళ్లడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొందరు సెల్ఫీలు, వీడియోల కోసం జంతువులకు చేరువ కావడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.
ఈ ఘటన అనంతరం పార్క్ అధికారులు మరోసారి సందర్శకులకు హెచ్చరికలు జారీ చేశారు. అడవి జంతువులు పూర్తిగా సహజ స్వభావంతో ఉంటాయని, వాటికి దగ్గరగా వెళ్లడం లేదా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. పార్క్‌లోని భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వన్యప్రాణుల నుంచి సురక్షిత దూరం పాటించాలని సూచించారు.
A tourist was seriously injured after a bison tossed them about 8 feet into the air in Yellowstone National Park. The attack was captured on video by photographer Mike Macleod. pic.twitter.com/ZtGTb32Gee
— Breaking911 (@Breaking911) July 12, 2026
