Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: కూటమిని ఎదుర్కోవడానికి జగన్ టాస్క్.. మాజీ మంత్రులు ముందుకొస్తారా..

YS Jagan Mohan Reddy: కూటమిని ఎదుర్కోవడానికి జగన్ టాస్క్.. మాజీ మంత్రులు ముందుకొస్తారా..

YS Jagan Mohan Reddy: గొడ్డలి పార్టీ అని.. విధ్వంసకర పార్టీ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన పార్టీ అని.. అభివృద్ధిని పక్కనపెట్టి.. రాష్ట్రంలో హింసను ప్రేరేపించిన పార్టీ అని.. ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి పవన్ వరకు ఎవరు కూడా వైసిపి అని సంబోధించడం లేదు. గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

తమ పార్టీ పేరు గొడ్డలి అని పరోక్షంగా విమర్శిస్తున్న కూటమినేతలకు వైసీపీ నాయకులు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. పైగా గొడ్డలి అనేది తమ అధికారిక సింబల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పరశురాముడు చేతిలో కూడా గొడ్డలి ఉంటుందంటూ వితండవాదం చేస్తున్నారు.. కనీసం పురాణాలు కూడా తెలియని స్థితిలో వైసిపి నేతలు ఉన్నారు. మాదకద్రవ్యాలు.. హత్యలు.. దారుణాలు.. ఘోరాలు.. క్రూరాలు.. ఎన్నో నయవంచక సంఘటనలు జరిగాయని కూటమినేతలు వైసిపి పరిపాలన మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

రెవెన్యూ నుంచి మొదలుపెడితే హోం శాఖ వరకు ప్రతి అంశం మీద కూటమినేతలు గణాంకాలతో సహా బయటపెడుతున్నారు. పెట్టుబడులు.. అభివృద్ధి.. సంక్షేమ పథకాలు.. మౌలిక వసతులు.. ఇలా ప్రతి అంశం లోను కూటమినేతలు లెక్కలతో సహా వైసిపి నేతల మీద విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూటమినేతలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కూటమి నేతలు గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నప్పుడు.. అదే పని వైసీపీ మాజీ మంత్రులు చేయలేకపోతున్నారు.

వైసీపీ మాజీ మంత్రులు వ్యవహరిస్తున్న శైలి పట్ల జగన్ ఆగ్రహం గా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది మాజీ మంత్రులు ఇప్పటికీ ప్రజా క్షేత్రంలోకి రావడం లేదని.. కూటమినేతల ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పడం లేదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఇకపై కూటం నేతలు చేసిన విమర్శలకు దీటుగా బదులు చెప్పాలని మాజీ మంత్రులకు జగన్ వర్తమానం పంపినట్టు సమాచారం. అలా చేసిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. నాడు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఎంత మంది ముందుకు వస్తారు.. కూటమినేతలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు.. చూడాల్సి ఉంది. కూటమినేతలకు గట్టిగా బదులు ఇవ్వడానికి జగన్ ఇప్పటికే వైసీపీ కిచెన్ క్యాబినెట్ రూపొందించినట్టు సమాచారం. జగన్ ఇచ్చిన టాస్క్ ను మాజీ మంత్రులు పూర్తిచేస్తారా.. దీనిని పూర్తి చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారు.. కాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version