School Boy Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటుంటే.. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి.. కొన్ని వీడియోలు పొట్ట పగిలే విధంగా నవ్వించే విధంగా ఉంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియోలో ఓ బాలుడు మంచం లో పడుకున్నాడు. అతడు అలా పడుకున్నప్పటికీ తోటి స్నేహితులు వదిలిపెట్టలేదు. స్నేహితుల తాకిడికి తట్టుకోలేక అతడు మంచాన్ని అలానే అతుక్కుని ఉన్నాడు. స్నేహితులు అలానే ఎత్తుకొని వస్తున్నారు. చూసేందుకు ఆ వీడియోలో ఆ బాలుడు ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఆ బాలుడు స్కూల్ కి వెళ్లకుండా ఇంటిదగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం సలహా మేరకు అతడి ఇద్దరి స్నేహితులు ఇంటికి వెళ్లారు. స్కూలుకు రాకుండా ఇంటి వద్ద ఉంటున్న స్నేహితుడిని గట్టిగా పట్టుకున్నారు. అతడు ఎంతసేపటికి స్కూలుకు రావడానికి ఇష్టపడలేదు. అంతేకాదు మంచం మీద అలానే పడుకుని ఉన్నాడు. దీంతో అతని స్నేహితులు ఆ మంచాన్ని అలా ఎత్తుకొని వచ్చి స్కూల్ దాకా తీసుకొచ్చారు.
ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఇటువంటి దృశ్యాలు 90 కాలంలోనే చోటు చేసుకునేవి. నాటి కాలంలో స్కూల్ కి రాకుండా ఎవరైనా ఇంటి వద్ద ఉంటే అతని స్నేహితులను పంపించేవారు. ఆ స్నేహితులు ఇంటికి వెళ్లి స్కూల్ కు లాక్కొని తీసుకొచ్చేవారు. అయితే నాటి కాలంలో పిల్లలు అలా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కానీ నేటి కాలంలో కూడా ఆ తరహా సంఘటనలు జరగడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నేటి సోషల్ మీడియా కాలంలోనూ ఇటువంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
90’s అయినా 20’s అయినా స్కూల్కు వెళ్లకపోతే ఇంతే
అప్పట్లో నాలుగు దెబ్బలు వేసి స్కూల్కు తీసుకెళ్లే తల్లిదండ్రులు.. ఎక్కడ ఆడుకుంటున్నా ఎత్తుకెళ్లే ఫ్రెండ్స్
తాజాగా అలాంటిదే ఘటన — స్కూల్కు వెళ్లడం ఇష్టం లేక మంచానికి అతుక్కుపోయిన ఓ అబ్బాయిని మంచంతో సహా స్కూల్కు… pic.twitter.com/H6cCXtYUaV
— greatandhra (@greatandhranews) November 3, 2025